Akira Nandan first movie director: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో స్టార్ హీరోగా మారడమే కాకుండా టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా నందన్ సైతం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మైంటైన్ చేయాలని పవన్ కళ్యాణ్ సైతం ఆశిస్తున్నాడు. ఇప్పటికే యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్న ఆయన తన మొదటి సినిమాను స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైతం కొంతమంది దర్శకులతో కథ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే అకిరా నందన్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసే బాధ్యతను శ్రీకాంత్ ఓదెలకు అప్పజెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. పారడైజ్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే ఆ తర్వాత శ్రీకాంత్ చిరంజీవితో ఒక గ్యాంగ్ స్టర్ మూవీ చేయబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత అకీరా నందన్ ను పరిచయం చేసే బాధ్యతను సైతం తనకు అప్పజెప్పాలనే ప్రయత్నంలో ఉన్నారట. మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా మారుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి శ్రీకాంత్ ఓదెల అకిరా ను టాప్ లెవెల్లో నిల్చో బెడతాడా? మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని కట్టబెట్టి అతన్ని స్టార్ హీరోగా మార్చడంలో తను కీలకపాత్ర వహిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… శ్రీకాంత్ ఓదెల మేకింగ్ లో ఒక రా ఫీల్ ఉంటుంది.
దానివల్ల శ్రీకాంత్ తో చేస్తే అకిరా కి మాస్ ఇమేజ్ వస్తుందని దాని వల్ల తను మాస్ హీరోగా మారడం చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే అకీరా ను శ్రీకాంత్ డైరెక్షన్లో నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఈ విషయం మీద మెగా ఫ్యామిలీ గాని, శ్రీకాంత్ గాని ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయనప్పటికి తొందరలోనే ఈ కాంబినేషన్ అయితే సెట్ అవ్వబోతుందనే వార్తలైతే వస్తున్నాయి…
