Homeఎంటర్టైన్మెంట్Nag Ashwin Akira Nandan movie: పాన్ ఇండియా డైరెక్టర్ తో అకిరా నందన్ మొదటి...

Nag Ashwin Akira Nandan movie: పాన్ ఇండియా డైరెక్టర్ తో అకిరా నందన్ మొదటి సినిమా…

Nag Ashwin Akira Nandan movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తనదైన రీతిలో సత్తా చాటాడు. ప్రస్తుతం తన నట వారసుడు అయిన అకిరా నందన్ ను సైతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి సంబంధించిన శిక్షణను కూడా ఇప్పిస్తున్నాడు. వీలైనంత తొందరగా అఖిరా నందన్ ఒక సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే అతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే దర్శకుడు ఎవరు అనే విషయంలో కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కల్కి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన నాగ్ అశ్విన్ తో అకిరా తన మొదటి సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియా మొత్తం ఒకటే న్యూస్ అయితే వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అకిరా నందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ను సైతం నాగ్ అశ్విన్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు. దాంతో పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా ను దాన్ని హీరోగా పెట్టి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించే ప్రయత్నంలో తను ఉన్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి కథను కూడా వినిపించాడట.

పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. వీలైనంత తొందరగా అకిరా తో తను సినిమా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ సైతం వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా చిరుత సినిమా చేశాడు.

కాబట్టి అకిరా నందన్ ను సైతం వాళ్ల బ్యానర్ లోనే ఇంట్రడ్యూస్ చేయించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. నాగ్ అశ్విన్ నిజంగానే అకిరా ను పరిచయం చేయబోతున్నాడా ? లేదా అనేది తెలియాలంటే మాత్రం వల్ల నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version