https://oktelugu.com/

ప్చ్.. జంటలందూ ఈ జంట వేరయా !

కొన్ని జంటలకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అలాంటి జంట ఏమి చేసినా వారి మధ్య ఏదో జరుగుతుంది అని పుకార్లు పుట్టిస్తుంటారు. అలాగే ‘మోనాల్‌-అఖిల్‌ మధ్య ఏదో ఉందని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి నుండి, వారి పై పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తమ పై వచ్చే రూమర్స్ ను ఏ మాత్రం పట్టించుకునే స్థితిలో లేరు ఈ జంట. పైగా జనానికి తమ పై ఉన్న అనేక అనుమానాలను […]

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2021 4:21 pm
    Follow us on

    Monal Akhilకొన్ని జంటలకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అలాంటి జంట ఏమి చేసినా వారి మధ్య ఏదో జరుగుతుంది అని పుకార్లు పుట్టిస్తుంటారు. అలాగే ‘మోనాల్‌-అఖిల్‌ మధ్య ఏదో ఉందని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి నుండి, వారి పై పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తమ పై వచ్చే రూమర్స్ ను ఏ మాత్రం పట్టించుకునే స్థితిలో లేరు ఈ జంట.

    పైగా జనానికి తమ పై ఉన్న అనేక అనుమానాలను నిజం చేస్తూ నిత్యం నెట్టింట హల్‌ చేస్తుంటారు వీరిద్దరూ. పైకి మాత్రం తాము మంచి స్నేహితులం అంటారు, బయట మాత్రం అంతకుమించిన ప్రేమను ఒకరి పై ఒకరు చూపిస్తుంటారు. దీనికితోడు ప్రేమ, పెళ్లి లాంటి పదాలు వాడుతూ తమ ఫాలోవర్స్ తో పాటు ప్రేక్షకులను కూడా కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు.

    నిన్న మోనాల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు, అఖిల్‌ బర్త్‌డే విషెష్‌ చెబుతూ మోనాల్ గురించి ఒక అమర ప్రేమికుడు రాసినట్టు ఓ లవ్ లెటర్ లా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఇతగాడు మోనాల్ గురించి రాసింది ఏమిటయ్యా అంటే.. ‘రాణులకు సంబంధించి నేను ఇప్పటికే ఎన్నో కథలు విన్నాను. కానీ నేను చూసిన రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వే. అఖిల్ బాగా ఎమోషనల్ అయినట్టు ఉన్నాడు.

    ఇక మోనాల్ గురించి వర్ణించడానికి తాను వాడే పదాలు చాలా చిన్నవి అట. అంటే పదాల సైజ్ పెంచాలేమో. అయినా పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని కూడా అఖిల్ రాసుకొచ్చాడు. ఇక మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాడు. పనిలో పనిగా మోనాల్‌ భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకున్నాడు. ఇక పోస్ట్ చివర్లో ప్రేమతో జైకృష్ణ జై శ్రీరామ్ అంటూ ముగించాడు. మొత్తానికి అఖిల్ బాబు పోస్ట్ చూస్తుంటే యవ్వారం చాలా దూరం వెళ్లినట్టు ఉంది. ఏది ఏమైనా జంటలందూ ఈ జంట వేరయా.