Homeఎంటర్టైన్మెంట్Lenin Movie: లెనిన్ మీద అంచనాలైతే లేవు... అఖిల్ ను కాపాడేది ఎవరు..?

Lenin Movie: లెనిన్ మీద అంచనాలైతే లేవు… అఖిల్ ను కాపాడేది ఎవరు..?

Lenin Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కెరియర్ స్టార్టింగ్ లో రొమాంటిక్ సినిమాలతో పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టుకున్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలను చేయడంలో నాగార్జునను మించిన వారు ఎవరు లేరనెంతలా గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇక అలాంటి నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరిన్ని సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…అక్కినేని నట వారసులు అయిన నాగ చైతన్య, అఖిల్ లకు ఎన్ని సినిమాలు చేసిన కూడా వారికి ఏమాత్రం సక్సెస్ రావడం లేదు.

ఇక ఇలాంటి క్రమంలోనే వారి నుంచి రాబోతున్న సినిమాల విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య ‘వృషకర్మ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక అఖిల్ సైతం డిఫరెంట్ సినిమాలైతే చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేస్తున్న లెనిన్ సినిమాతో సక్సెస్ ను సాధించి తన స్టామినా ఏంటో చూపిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

సినిమా ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క సక్సెస్ కూడా లేని నట వారసుడు అఖిల్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సక్సెస్ తో అయిన ముందుకు సాగుతున్నారు. కానీ అఖిల్ కి మాత్రం ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్న కథలో క్వాలిటి ఉండటం లేదు.

అలాగే డైరెక్టర్ డైరెక్షన్ చేసేటప్పుడు అఖిల్ తన ఇన్పుట్స్ ఇస్తుంటాడట. ప్రస్తుతం అఖిల్ కి ఈ సినిమాతో సక్సెస్ పడితేనే ఆయన నిలదొక్కుకుంటాడు. లేకపోతే మాత్రం అతన్ని కాపాడే వారు ఎవరు ఉండరనేది వాస్తవం… ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు. కానీ అఖిల్ మాత్రం తన వైఖరి మార్చుకోకపోతే మాత్రం ఫ్యూచర్ లో స్టార్ హీరోగా మారే అవకాశాలైతే లేకుండా పోతాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular