https://oktelugu.com/

Akhil Akkineni Dheera: మళ్ళీ అదే తప్పు చేస్తున్న అఖిల్… మనకు అవసరమా ‘ధీర’?

నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఆ కోరిక తీరుస్తాడని అక్కినేని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. అయితే మొదట్లో ఉన్న ఆశలు ఇప్పుడు లేవు. మెల్లగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. స్టార్ హీరో కావడం అటుంచితే అసలు.

Written By:
  • Shiva
  • , Updated On : May 11, 2023 / 08:49 AM IST
    Follow us on

    Akhil Akkineni Dheera: టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఏఎన్నార్ స్టార్ హీరోగా చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు ఏలారు. ఆయన వారసుడు నాగార్జున ఆ లెగసీ ముందుకు తీసుకెళ్లారు. నాగార్జున టాప్ హీరో హోదా అనుభవించారు. మూడో తరం పెద్దగా సక్సెస్ కాలేదు. ఏఎన్నార్ వారసులైన సుమంత్, సుశాంత్ హీరోలుగా ఫెయిల్ అయ్యారు. నాగార్జున పెద్ద కుమారుడు చైతన్య మాత్రమే సక్సెస్ అయ్యాడు. అయితే టైర్ టు హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకు స్టార్ హోదా దక్కలేదు. అక్కినేని ఫ్యామిలీకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఒక్క హీరో కూడా టాప్ హీరోల లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోతున్నారు.

    నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఆ కోరిక తీరుస్తాడని అక్కినేని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. అయితే మొదట్లో ఉన్న ఆశలు ఇప్పుడు లేవు. మెల్లగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. స్టార్ హీరో కావడం అటుంచితే అసలు… హీరోగా నిలదొక్కుకుంటాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అఖిల్ హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు ఏడేళ్లు అవుతుంది. ఆయన కనీస ఇమేజ్ తెచ్చుకోలేదు. అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ అంటూ చొక్కాలు చింపుకోవడమే కానీ… మిగతా వర్గాల్లో అఖిల్ ని హీరోగా ఇంకా గుర్తించలేదు.

    నాగ చైతన్య ప్రేమకథా చిత్రాలతో టైర్ టూ హీరోల జాబితాలో ఉండిపోయాడు. దీంతో అఖిల్ ని మాస్ హీరోగా నిలబెట్టాలని నాగార్జున భావిస్తున్నారు. మనం అనుకుంటే కారు. అతనిలో మాస్ హీరోగా ఎదిగే లక్షణాలు, టాలెంట్ ఉన్నాయా? అన్నదే ముఖ్యం. అరంగేట్రమే అదిరిపోవాలని ముప్పై కోట్లకు పైగా బడ్జెట్ తో ‘అఖిల్’ మూవీ తెరకెక్కించారు. సోషియో ఫాంటసీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన అఖిల్ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. దర్శకుడు వివి వినాయక్ ని నమ్ముకున్నా పని కాలేదు.

    తర్వాత వరుసగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ చేశారు. అవి కూడా అంతంత మాత్రమే. అఖిల్ కెరీర్లో హిట్ అనిపించుకున్న మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక లేటెస్ట్ మూవీ ఏజెంట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. డబుల్ డిజాస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ హీరో కావాలని అఖిల్ చేసిన రెండు ప్రయత్నాలు చేదు అనుభవాలు మిగిల్చాయి. అఖిల్, ఏజెంట్ పరాజయం పొందాయి.

    అయినా వెనక్కి తగ్గని అఖిల్ అదే తప్పు చేస్తున్నాడట. ఆయన నెక్స్ట్ మూవీ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. ధీర అనే టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీకి సాహో చిత్రానికి అసిస్టెంట్ గా పని చేసిన అనిల్ కుమార్ దర్శకుడట. మగధీర, కెజిఎఫ్ చిత్రాల రేంజ్ లో ధీర ఉంటుందట. ఇది సోషియో ఫాంటసీ, యాక్షన్ మూవీ అట. ఈ ప్రకటన టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. అదే సమయంలో అఖిల్ ని భారీగా ట్రోల్ చేస్తున్నారు. మనకు సెట్ కానీ సబ్జక్ట్స్ అవసరమా? ముందు ఈ మాస్ హీరో ఆశలు వదిలేయ్? కనీస నటుడిగా గుర్తింపు తెచ్చుకో అంటున్నారు.