Akhanda 2 Trailer Review : బాలయ్య బాబు ఈ సినిమాలో ఏదో ఒక గొప్ప కథంశమైతే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మాస్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఈసారి బోయపాటి డైరెక్షన్లో చేస్తున్న ‘అఖండ 2’ సినిమాతో సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన అఖండ 2 ట్రైలర్ ని కనక మనం చూసినట్టయితే ఈ సినిమాలో బాలయ్య విళయతాండవం చేస్తున్నాడు. ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య మనదేశంలో ఉన్న లోటుపాట్లమీద తీవ్రమైన కసరత్తులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సనాతన ధర్మాన్ని ఎలుగెత్తి చెప్పే పాత్రలో బాలయ్య కనిపించడమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియాలో ఉన్న మనం ఏం చేయాలి. ఇలా అయితే దేశం బాగుంటుంది అనే బాధ్యతను నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైలర్లో బాలయ్య నరకడం చూస్తే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక విజువల్స్ ని చూసినట్లయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి ఇక బోయపాటి మేకింగ్ డిఫరెంట్ గా అనిపించింది. ఇంతకుముందు బోయపాటి ఏం చేసిన కూడా అవే నాలుగు ఫైట్లు, రెండు డైలాగ్స్ తో సినిమాని ముగించేవాడు.
కానీ ఈ సినిమాలో ఒక ధర్మం గురించి, హిందుత్వం గురించి చాలా బాగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… బాలయ్య గత సినిమాలతో తన పొటెన్షియాలిటీని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియాలో అతను ఒక స్టార్ హీరోగా మారబోతున్నాడు అనేది 100% వాస్తవమని తెలుస్తోంది.
ఇక నార్త్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో తంత్ర శక్తి ని దేవుడు ఎలా నాశనం చేశాడు అనేది కూడా చూపిస్తున్నారు…కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ గా మారబోతోంది… ఇక బాలయ్య స్టైల్ లో చెప్పిన డైలాగ్ కూడా బాగుంది. ‘ఇప్పటివరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసి ఉంటారు. విశ్వరూపాన్ని చూసి ఉండరు.మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అంటూ బాలయ్య బాబు చెప్పిన డైలాగుకి ప్రతి ఒక్క ఇండియన్ కి పూనకాలు వస్తున్నాయి…
విదేశాల వాళ్ళు మన దేశం మీదకి దండెత్తి వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బోయపాటి ఇప్పటికే తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. కానీ ఈ సినిమాలో తన మేకింగ్ మొత్తాన్ని మార్చేసినట్టుగా తెలుస్తోంది. ఏదో సింపుల్ స్టోరీని కాకుండా చాలా గొప్ప కథనే ఈ సినిమాలో చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది…