https://oktelugu.com/

Akhanda: ‘అఖండ’ విజయం కూడా ఆమెకు కలిసి రాలేదు !

Akhanda: ‘ప్రగ్యా జైస్వాల్’లో అందం ఉంది, అభినయం ఉంది. కానీ క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. ఇన్నాళ్లు ఆ బాధతోనే ఎప్పుడు లోలోపల కుమిలిపోతూ ఉంటుంది ‘ప్రగ్యా జైస్వాల్’. చివరకు బాలయ్య సినిమాలో నేను హీరోయిన్ గా నటించాల్సి రావడం ‘నా బ్యాడ్ లక్’ అంటూనే మొత్తానికి అఖండతో భారీ హిట్ కొట్టింది. అయితే, సాధారణంగా ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే, ఆ సినిమాలో నటించిన నటీనటులకు ముఖ్యంగా హీరోహీరోయిన్లకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, అఖండ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 21, 2021 / 04:41 PM IST
    Follow us on

    Akhanda: ‘ప్రగ్యా జైస్వాల్’లో అందం ఉంది, అభినయం ఉంది. కానీ క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. ఇన్నాళ్లు ఆ బాధతోనే ఎప్పుడు లోలోపల కుమిలిపోతూ ఉంటుంది ‘ప్రగ్యా జైస్వాల్’. చివరకు బాలయ్య సినిమాలో నేను హీరోయిన్ గా నటించాల్సి రావడం ‘నా బ్యాడ్ లక్’ అంటూనే మొత్తానికి అఖండతో భారీ హిట్ కొట్టింది. అయితే, సాధారణంగా ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే, ఆ సినిమాలో నటించిన నటీనటులకు ముఖ్యంగా హీరోహీరోయిన్లకు డిమాండ్ పెరుగుతుంది.

    Akhanda

    కానీ, అఖండ సక్సెస్ మొత్తం బాలయ్య ఖాతాలోకే వెళ్ళిపోయింది. దాంతో ‘ప్రగ్యా జైస్వాల్’ ను పట్టించుకునే వాడే లేకుండా పోయాడు. మొత్తానికి అఖండ ప్రగ్యా కెరీర్ కు ప్లస్ కాలేదని తేలిపోయింది. అఖండ తర్వాత లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటే.. తనకు కొత్త సినిమాలు రాకపోవడం ప్రగ్యాను చాలా బాధ పెడుతుందట. నిజానికి ప్రగ్యా జైస్వాల్ కి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి.

    పైగా ఆమెకు భాష పై పట్టు కూడా ఉంది. అలాగే నటన పై కూడా ఆసక్తి ఉంది. మంచి నటి అని కూడా ఆమెకు మంచి పేరు ఉంది. అయినా ఎందుకో ప్రగ్యా జైస్వాల్ ను ఎవరూ పట్టించుకోలేదు. బోయపాటి పుణ్యమా అని ఎట్టకేలకు ఈ భామకు అవకాశం వచ్చింది. అఖండలో నటించింది. కానీ అఖండలో ప్రగ్యా జైస్వాల్ పాత్రపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి.

    మొదట ఈ పాత్రలో నయనతార నటించాలి. కానీ, కొన్ని కారణాల వల్ల నయనతార ఈ సినిమాలో నటించలేదు. నయనతార చేయాల్సిన పాత్రలో ప్రగ్యా జైస్వాల్ నటించింది. నయనతార పాత్రలో ప్రగ్యా తేలిపోయింది అని విమర్శలు వినిపించాయి. మొత్తమ్మీద అఖండ విజయం వల్ల ఆమెకు కొత్తగా దక్కిందేమీ లేదని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

    Also Read: Pushpa Collections: ‘పుష్ప’ లేటెస్ట్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ అయింది !

    ఇక ప్రగ్యా జైస్వాల్ గతంలో ఓ క్రియేటివ్ డైరెక్టర్ తో చాలా సన్నిహితంగా ఉంది. మరి ఆ డైరెక్టరే ఆమెకు మళ్లీ అవకాశం ఇచ్చి.. ఆమె కెరీర్ ను నిలబెడతాడేమో చూడాలి. ప్రస్తుతానికి ప్రగ్యాకి ఏ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేవు.

    Also Read: Shyam Singha Roy: ‘శ్యామ్​ సింగరాయ్’​లో కిస్ సీన్​పై యాంకర్​ డౌట్​.. స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చిన సాయిపల్లవి

    Tags