https://oktelugu.com/

Akhanda: అఖండలో అందర్నీ ట్రాన్స్​లోకి తీసుకెళ్లిన ఆ సీన్​.. బోయపాటి విజువల్​ మెస్మరైజ్​

Akhanda: ప్రస్తుతం టాలీవుడ్​లో మాస్​ డైరెక్టర్ అంటే గుర్తొచ్చేంది బోయపాటి శ్రీను, పూర జగన్నాథ్​. వీరిద్దరి దర్శకత్వంలో వచ్చే సినమాలు ప్రజెంటేషన్​ వేరే లెవల్​లో ఉంటాయి. ముఖ్యంగా బోయపాటి తెరకెక్కించిన సినిమాలన్నీ మాస్ మసాలా డ్రామాతో పాటు ప్యామిలీ ఎమోషన్స్​ను కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా అఖండ. అయితే, ఈ సినిమా ఆయన కెరీర్​లోనే పూర్తి డిఫరెంట్​ అని చెప్పుకోవచ్చు.  ఈ సినిమాలో మునుపెన్నడూ లేని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 11:52 AM IST
    Follow us on

    Akhanda: ప్రస్తుతం టాలీవుడ్​లో మాస్​ డైరెక్టర్ అంటే గుర్తొచ్చేంది బోయపాటి శ్రీను, పూర జగన్నాథ్​. వీరిద్దరి దర్శకత్వంలో వచ్చే సినమాలు ప్రజెంటేషన్​ వేరే లెవల్​లో ఉంటాయి. ముఖ్యంగా బోయపాటి తెరకెక్కించిన సినిమాలన్నీ మాస్ మసాలా డ్రామాతో పాటు ప్యామిలీ ఎమోషన్స్​ను కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా అఖండ.

    అయితే, ఈ సినిమా ఆయన కెరీర్​లోనే పూర్తి డిఫరెంట్​ అని చెప్పుకోవచ్చు.  ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా కథను ప్రిపేర్​ చేసి ప్రేక్షకులను థియేటర్లకు పరిగెత్తుకొచ్చేలా చేశారు బోయపాటి. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాలో మాస్​తో పాటు అద్భుతమైన విజువల్స్​ను చూపించి అందరనీ మెస్మరైజ్​ చేశారు బోయపాటి. ఇందులో తక్కువగానే గ్రాఫికర్ ట్రీట్​ ఇచ్చినప్పటికీ.. అందర్నీ ఆకట్టుకుంది.

    గతంలో ఎన్టీఆర్​తో దమ్ములో ఓ స్పెషల్​ సాంగ్​ను ప్లాన్​ చేయగా.. దీన్ని చూసి రాజమౌళి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అఖండలోనూ అదే విధంగా చిన్న విజువల్ టచ్​ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అఖండలో సెకండ్​ఆఫ్​ క్లైమాక్స్​లో బాలయ్య రథ చక్రం పట్టుకుని అలా పైకి ఎత్తిన సీన్​ అందరికీ గుర్తుంది కదా.. ఆ సమయంలో రుద్ర తాండవం చేసే పరమశివుడిలా బాలయ్యను చూపించడం అందర్నీ మెస్మరైజ్​కు గురి చేసింది. ఈ సీన్​తో సినిమా చూస్తున్న వాళ్లంతా  కాసేపు ట్రాన్స్​లోకి వెళ్లిపోయారు. దీంతో బాయపాటి విజువల్కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  ప్రస్తుతం  ఆ లుక్​కు సంబంధించిన పిక్స్ సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.