Akhanda Movie: నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా “అఖండ “. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు వీరిద్దరూ సిద్ధమవుతున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. కాగా శ్రీకాంత్, పూర్ణ… ప్రతి నాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం మరి ప్రత్యేకత కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచియా దిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది.

ఈ మేరకు దసరా సందర్భంగా నవంబరు 4న అఖండ సాంగ్ టీజర్ ను ఉదయం 11.43 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి వీడియోను 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలయ్య.. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. అంతకుముందు ఈ చిత్రంలోని ఓ సాంగ్, రెండు టీజర్లు విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Make way for Roaring #AkhandaTitleSong Teaser🔥🦁
Roar on 4th Nov 11: 43AM
Full Lyrical Video on 8th Nov!#AkhandaMusicalRoar #BB3#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @IamJagguBhai @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @LahariMusic pic.twitter.com/7RHZ3XeIme
— Dwaraka Creations (@dwarakacreation) November 2, 2021
సి.రాంప్రసాద్ ఛాయాగ్రహణం చేశారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చేసుకుంటుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కలయికలో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత బాలకృష్ణ చేయనున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ తాజా అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాకపోతే మరోవైపు బాలయ్య హాస్పిటల్ లో చేరారన్న వార్తతో ఆయన అభిమానుల్లోఆందోళన నెలకొంది.