Akhanda Movie Dialogues: తెలుగు ప్రేక్షకులకు బాలయ్య డైలాగ్ లు అంటే పిచ్చి. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు అయితే అవి వ్యసనం. ఈ నేపథ్యంలో వచ్చిన నిజమైన మాస్ సినిమా అఖండలోని పవర్ ఫుల్ డైలాగ్ లకు బి,సి సెంటర్లతో సహా మల్టీప్లెక్స్ లు, సోషల్ మీడియా పేజీలు ఊగిపోతున్నాయి. ఎక్కడ క్లిక్ చేసినా ఇప్పుడు అంతా బాలయ్య మాటలే వినిపిస్తున్నాయి.

మొత్తానికి బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇక ‘అఖండ’ సింగిల్ స్క్రీన్స్ ను ఒక ఊపు ఊపేస్తోంది. మరోపక్క అఖండ సినిమాలోని డైలాగులను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అఖండ సినిమాలో హైలైట్ గా కానున్న బాలయ్య డైలాగ్స్ ఇవే.
హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.
ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!
Also Read: Akhanda Telugu Movie Review : ‘అఖండ’ మూవీ రివ్యూ
ఏయ్, అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా ? పట్టిసీమ తుమా ? పిల్ల కాలువ.. కొడకా
విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!

నేను ఆత్మ వాడు నా శరీరం

నలభైమంది చచ్చారు నీవల్లే ..!

నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!

కళ్ళు తెరిచి జూలు విరిస్తే ..!

ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.

ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!

లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.

నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.

ముఖ్యంగా అఘోర పాత్ర హిందుత్వంపైనా, దేవాలయాలపైనా జరుగుతున్న దాడులకు సంబంధించి చెప్పిన మాటలు చాలా బాగా ఆకట్టుకున్నాయి.
‘హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూసినా.. పంచభూతాలకు విరుద్ధంగా ప్రవర్తించేలా ప్రవర్తించినా ఆ పరమాత్మడు ఏదో ఒక రూపంలో వచ్చి దుష్టులను శిక్షిస్తాడు’ అంటూ బాలయ్య డైలాగ్ ను చెప్పిన విధానం అద్భుతం అనొచ్చు.

Also Read: Akhanda Twitter Review: మాస్.. ఊరమాస్.. బాలయ్య శివతాండవం..‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ

అలాగే మరో డైలాగ్.. ‘విజ్ఞానం ఎంత ముందుకు వెళ్లినా వినాయకుడికి మొక్కకుండా ఉండగలమా’ అంటూ ఇలా ఎన్నో హిందుత్వానికి సంబంధించిన డైలాగ్స్ బాలయ్య అద్భుతంగా చెప్పారు. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ లను ఇప్పుడు మీమ్స్ రాయుళ్లు తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

