https://oktelugu.com/

Akhanda Movie Child Artist: ‘అఖండ’ చిత్రం లోని ఈ చిన్నారి ఎవరి కూతురో తెలిస్తే నోరెళ్లబెడుతారు..ఇన్ని రోప్జులు ఎవరూ గుర్తించలేదుగా!

ఈ పాప పేరు దీష్ణ, ఈమె ఈ చిత్రం తర్వాత మళ్ళీ వెంటనే కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన 'భింబిసారా' చిత్రం లో కూడా నటించింది. ఈ సినిమాలో కూడా ఈ పాప కథని మలుపు తిప్పే పాత్రలోనే కనిపిస్తుంది. హీరో తో చాలా ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది. అందువల్లే ఈ చిత్రం అంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఇలా ఈ రెండు సినిమాలు గ్రాండ్ హిట్ అవ్వడానికి కీలక పాత్ర పోషించిన ఈ దీష్ణ ఎవరు?, ఎందుకు ఈమెకి దర్శక నిర్మాతలు కథ ని ఎంతో ప్రభావితం చేసే పాత్రలు ఇస్తున్నారు ?, కచ్చితంగా ఈ చిన్నారి కి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది అని అనుకునేవాళ్లు.

Written By:
  • Vicky
  • , Updated On : July 15, 2023 / 05:45 PM IST

    Akhanda Movie Child Artist

    Follow us on

    Akhanda Movie Child Artist: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘అఖండ’ చిత్రం కరువు లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకి కాసుల సునామీని చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ తో కెరీర్ ఇక క్లోజ్ అనుకుంటున్న సమయం లో బాలయ్య బాబు కి ఈ సినిమా తగిలింది. ఈ సినిమా నుండి మనం బాలయ్య లో సరికొత్త కోణాన్ని చూస్తున్నాము. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆయన చేసిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

    ఇక ‘అఖండ’ సినిమా అయితే అతి తక్కువ టికెట్ రేట్స్ తో కూడా 73 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఈ సినిమాలో నటించిన చిన్న పాప ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. క్యూట్ గా ఎంతో అమాయకత్వం తో మాట్లాడిన ఈ పాప తో బాలయ్య బాబు కి చిత్రం లో మంచి ఎమోషన్ ఉంది.

    ఈ పాప పేరు దీష్ణ, ఈమె ఈ చిత్రం తర్వాత మళ్ళీ వెంటనే కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘భింబిసారా’ చిత్రం లో కూడా నటించింది. ఈ సినిమాలో కూడా ఈ పాప కథని మలుపు తిప్పే పాత్రలోనే కనిపిస్తుంది. హీరో తో చాలా ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది. అందువల్లే ఈ చిత్రం అంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఇలా ఈ రెండు సినిమాలు గ్రాండ్ హిట్ అవ్వడానికి కీలక పాత్ర పోషించిన ఈ దీష్ణ ఎవరు?, ఎందుకు ఈమెకి దర్శక నిర్మాతలు కథ ని ఎంతో ప్రభావితం చేసే పాత్రలు ఇస్తున్నారు ?, కచ్చితంగా ఈ చిన్నారి కి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది అని అనుకునేవాళ్లు.

    అయితే అది నిజమే అని ఇప్పుడు తెలిసింది, విషయం లోకి వెళ్తే దీష్ణ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త గా పేరు సంపాదించిన శ్రీధర్ రెడ్డి అనే అతని కూతురు అట. ఈయన తెలుగు దేశం పార్టీ కి బాగా కావాల్సిన వాడట, అందుకే బాలయ్య బాబు అఖండ సినిమా లో తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ చిన్నారి రాబొయ్యే రోజుల్లో కూడా మరిన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించబోతున్నట్టు సమాచారం.