Akhanda: బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ లాంటి కొందరు హీరోలకే ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. వీళ్లకు కెరీర్ లో ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే క్రేజ్ మాత్రం తగ్గదు. అయితే, ఒక్కోసారి ప్లాప్ ల వలయంలో పడి, అదే పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో మాత్రం కొంతవరకు మార్కెట్ ను కోల్పోతారు. ఐతే, మళ్ళీ వీళ్ళు ఒక్క సూపర్ హిట్ ఇచ్చారంటే.. ఇక అన్నీ పటాపంచలు కావాల్సిందే.
Also Read: అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో మార్పులు.. వాతావరణ మార్పులే కారణమా?

వరుసగా డిజాస్టర్ల తర్వాత కూడా ఒకే ఒక్క సింగిల్ హిట్ చాలు. వీళ్ళు మళ్ళీ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి. ఇదేదో మాట వరసకు చెబుతున్న ముచ్చట కాదు. వాస్తవంగా చెబుతున్న వ్యవహారమే. బాలయ్య బాబు విషయానికే వద్దాం. బాలయ్య – బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తోన్న సినిమా ‘అఖండ’. ఇప్పటికే భారీ అంచనాలను పోగు చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.
అయితే, యూఎస్ లో ఈ సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. యూఎస్ లో మొత్తం 247 లొకేషన్స్ లో ప్రీమియర్ షోలు పడతాయట. పర్ఫెక్ట్ హిట్ కోసం బాలయ్య ఎంచుకున్న ఈ అఖండ(Akhanda) రివేంజ్ యాక్షన్ డ్రామాగా సాగుతూ మొత్తానికి బాగా ఆకట్టుకునేలా ఉన్నాడు. ముఖ్యంగా సినిమాలో అఘోరగా బాలయ్య చేసే యాక్షన్ సీన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట.
మరి ఇలాంటి ఓవర్ యాక్షన్ ను యూఎస్ ప్రేక్షకులు ఆదరించరు. కానీ అఖండ విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కారణం.. ఈ చిత్రం ట్రైలర్ కి వచ్చిన స్పందనే. పైగా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో బాలయ్య యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయట.
ఇక ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఆలాగే ఆ తర్వాత యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. అదేవిధంగా కొరటాల శివతో కూడా సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: ‘అఖండ’ సినిమా రన్ టైం ఎంతో తెలుసా?