Akhanda Collections: కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్ హిట్ పడలేదు. బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. థియేటర్స్ దగ్గర జనం బారులు తీరారు. అసలు.. ఇన్నాళ్లు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ రేంజ్ కు రాలేదు అని బాధ పడ్డ సినీ అభిమానులు.. ప్రముఖులు అఖండతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. బాలయ్య తన మార్క్ యాక్షన్ తో బాక్సాఫీస్ ను కిచిడీ కిచిడీ చేసి పారేశాడు.

అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అఖండ సినిమా కోసం ఎగబడుతున్నారు. నిజానికి అఖండకు విడుదలకు ముందు నుంచి విమర్శల ప్రశంసలు అందాయి. అటు బాలయ్య అఘోర లుక్ కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. దాంతో సినిమా బాగుంటుందనే పాజిటివిటీ మధ్యన అఖండ రావడం.. అఖండమైన విజయం సాధించడం శుభపరిణామం.
ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. అఖండ రెండో ఆదివారం నాడు వచ్చిన కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే..
నైజాం: 90 లక్షలు
సీడెడ్: 75 లక్షలు
వైజాగ్ ; 30 లక్షలు
ఉత్తరాంధ్ర: లక్షలు
ఈస్ట్: 18 లక్షలు
వెస్ట్: 15 లక్షలు
గుంటూరు: 25 లక్షలు
కృష్ణా: 20 లక్షలు
నెల్లూరు: 13 లక్షలు
Also Read: Shilpa Chaudhary: ‘కిలాడి’ శిల్పా చౌదరి ఇలా మారిపోయిందెంటీ?
ఏపీ + తెలంగాణ రెండో ఆదివారం మొత్తం కలెక్షన్స్ 3 కోట్లు వచ్చింది.
Also Read: Celebratie Siblings: టాలీవుడ్ హీరో హీరోయిన్ల తోబుట్టువులు వీళ్లే..!