Akhanda 2 Teaser: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో ఒక మామూలు సినిమా తెరకెక్కుతుంది అంటేనే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే ఈ ఏ కాంబినేషన్ కూడా ఇవ్వనంత కిక్ ఈ కాంబినేషన్ ఇస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళ కలయిక లో మూడు సినిమాలు తెరకెక్కితే మూడు కూడా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ‘అఖండ'(Akhanda Movie) చిత్రం అయితే బాలయ్య జీవితాన్నే మార్చేసింది. ఆయన ఆలోచన విధానం ని అప్డేట్ చేసింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టే ముందే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాకి ట్రేడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిది అనేది.
రేపు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ టీజర్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందని అంటున్నారు. బాలయ్య మార్క్ డైలాగ్స్ తో పాటు రెండు మూడు యాక్షన్ షాట్స్ అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తుందట. ఇదే టీజర్ లో ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ముందుగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో వినిపిస్తున్న మాట. ఒకవేళ అప్పటికీ కూడా సినిమా పూర్తి కాకుంటే సంక్రాంతికి దింపే ప్లాన్ కూడా ఉందట. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడలేదని తెలుస్తుంది.
ముందుగా అనుకున్న సెప్టెంబర్ 25 నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారట. రేపు ఈ విషయం లో స్పష్టమైన క్లారిటీ రానుంది. అయితే నేడు విడుదల చేసిన పోస్టర్ లో ఎక్కడా కూడా మూవీ విడుదల తేదీ గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే చర్చల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ప్రగ్యా జైస్వాల్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం లో విలన్ గా ఆది పిన్ని శెట్టి విలన్ గా నటిస్తున్నాడు. సంజయ్ దత్ కూడా ఈ చిత్రం ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు అన్నారు కానీ, దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. అదే విధంగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తుంది అంటూ పుకార్లు వినిపించింది. ఇది నిజమో కాదో కూడా రేపు టీజర్ తో తెలియనుంది.