Akhanda 2 Disaster: గత ఏడాది డిసెంబర్ 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ మూవీ ‘అఖండ 2′(Akhanda 2 Movie) కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘అఖండ’ భారీ విజయం తో మొదలైన బాలయ్య బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్రకు, ‘అఖండ 2’ పెద్ద బ్రేక్ వేసింది. 120 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే బయ్యర్స్ కి 50 నష్టం వాటిల్లింది. ఇక నిర్మాతకు ఓటీటీ డీల్ పరంగా కూడా నష్టమే. నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఈ చిత్రాన్ని అమ్మారు. వాళ్ళు ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తే 80 కోట్లు ఇస్తాము, లేదంటే 40 కోట్లు మాత్రమే ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.
ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై రెండు వారాలు అయ్యింది , ఈ రెండు వారాల్లో ఈ చిత్రానికి 40 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. మొదటి వారం 21 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకోగా, రెండవ వారం 19 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన సినిమా, బాలయ్య గత చిత్రం ‘డాకు మహారాజ్’ కి ఇదే నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలకు బాగా కనెక్ట్ అయ్యారు, ఇప్పటికీ ఆ సన్నివేశాలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది కాబట్టే, నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘అఖండ 2’ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించింది. కానీ ఈ మిశ్రమ స్పందన ఆ సంస్థకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
ప్రస్తుతం ఈ చిత్రం ఇండియా వైడ్ గా టాప్ 4 స్థానం లో ట్రెండ్ అవుతోంది. త్వరలోనే సంక్రాంతికి విడుదలైన సినిమాలు నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇవి వచ్చిన తర్వాత టాప్ 10 నుండి ఈ చిత్రం వైదొలిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని తో చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వీర సింహా రెడ్డి’ అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తరహాలో హిస్టారికల్ జానర్ లో తీయాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ 200 కోట్లు దాటేయడం, బాలయ్య కి అంత మార్కెట్ లేకపోవడం తో మాములు రొటీన్ కమర్షియల్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారట.