Akhanda 2 Premiere Shows Advance Bookings: నందమూరి(Nandamuri Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘అఖండ 2′(Akhanda 2 Thandavam) చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఒక రోజు ముందే, అనగా రేపు రాత్రి నుండి పైడ్ ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా మొదలు కానుంది. ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని నేడు ఉదయం నుండి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించారు. బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు, బయ్యర్స్ ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్స్ కి కొనుగోలు చేశారు, కానీ ఇప్పుడు ప్రీమియర్ షోస్ కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి భయపడుతున్నారు. కృష్ణా, గుంటూరు మరియు సీడెడ్ ప్రాంతాలు తప్ప, ఎక్కడా కూడా ఆన్లైన్ లో టికెట్స్ కదలడం లేదు. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలకు ప్రీమియర్ షోస్ టికెట్స్ కి వేరే లెవెల్ డిమాండ్ ఉండేది.
Also Read: బాలయ్య హిందీలో నరుకుడే నరకుడు..యాంకర్ కూడా షాక్.. వీడియో వైరల్!
ఈ చిత్రానికి కూడా ఆ రేంజ్ డిమాండ్ ఉంటుందేమో అని ఆశించారు. కానీ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రెండు కోట్ల రూపాయిల వరకు వచ్చిందని టాక్. బుక్ మై షో యాప్ లో గంటకు నాలుగు వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జీవో ఇంకా విడుదల కాలేదు. రేపు ఉదయం ఈ జీవో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రేపు ఉదయమే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నమోదు అయ్యే అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని బట్టీ ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ద్వారా ఓవరాల్ గా ఎంత గ్రాస్ చేస్తుంది అనేది చెప్పొచ్చు.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉంటే, ఓవర్సీస్ లో ఇంకా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. బోయపాటి శ్రీను సినిమాలకు మొదటి నుండి ఓవర్సీస్ లో డిమాండ్ ఉండదు. కానీ ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కాబట్టి, కచ్చితంగా 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ గ్రాస్ వస్తుందని ఆశించారు. కానీ అది జరగలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం రెండు లక్షల 50 వేల గ్రాస్ మాత్రమే వచ్చింది. ప్రీమియర్ మొదలయ్యే సమయానికి 6 లక్షల డాలర్ల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టాక్ రాకపోతే దారుణమైన ఫ్లాప్ గా ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.