Akhanda 2 Postponed: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్(SS Thaman) కి మన టాలీవుడ్ లో బాలయ్య(Nandamuri Balakrishna) సినిమా అంటే చాలు, ఆయనకు పూనకాలు వచ్చేస్తాయి. ఏ స్టార్ హీరోకి ఇవ్వనంత అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాలయ్య కి ఇస్తాడు, అందుకే ఆయన్ని అభిమానులు ప్రేమగా నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. స్వయంగా బాలయ్య నే తమన్ కి ఒక కారుని బహుమతిగా ఇస్తూ, మా నందమూరి తమన్ అంటూ నామకరణం చేసాడంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆయన బాలయ్య మనసుకి ఎంత దగ్గరయ్యాడో అనేది. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ ఇలా వరుసగా నాలుగు సినిమాలకు ఆయనే సంగీతం అందించాడు. ప్రతీ చిత్రానికి ఒక దానిని మించి ఒకటి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు పాటలను అందించాడు. ఈ సినిమాల్లోని తమన్ వర్క్ ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు, ఎందుకు బాలయ్య ఆయన్ని నందమూరి తమన్ అని పిలిచాడు అనేది.
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
ఇప్పుడు ‘అఖండ 2′(Akhanda 2 Movie) కి కూడా తమన్ నే సంగీతం అందిస్తున్నాడు. అయితే రీసెంట్ గా బాలయ్య పెద్ద కూతురు బ్రహ్మీని తమన్ తో ఒక సంభాషణ జరుపుతూ ‘మీ వల్లే అఖండ 2 వాయిదా పడింది అంటున్నారు మీ మూవీ టీం మొత్తం’ అని సరదాగా అంటుంది. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నందమూరి ఫ్యాన్స్ కూడా దీనిని చాలా ఫన్నీ గానే తీసుకున్నారు. అయితే తమన్ సంగీతం అందిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’ నుండి రీసెంట్ గానే ఒక గ్లింప్స్ వీడియో విడుదలైంది. పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఈ క్రేజీ చిత్రం పై ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొన్న విడుదల చేసిన గ్లింప్స్ వీడియో లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
దీనిని చూసి నందమూరి ఫ్యాన్స్ తమన్ ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ ని ‘ఓజీ’ చిత్రం పైనే పెట్టాడు. ఒక పక్క అఖండ 2 కి హీరో బాలయ్య హిందీ డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు. కానీ తమన్ మాత్రం ఇంకా తనకు సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ ని మొదలు పెట్టలేదు. ఓజీ చిత్రానికి ప్రధమ స్థానం ఇస్తూ, మా అఖండ 2 ని నిర్లక్ష్యం చేశాడంటూ సోషల్ మీడియా లో నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆయన కారణంగానే సినిమా వాయిదా పడిందని ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు. వాస్తవానికి అఖండ 2 , ఓజీ చిత్రాలు సెప్టెంబర్ 25 న విడుదల కావాల్సి ఉంది. ‘అఖండ 2’ పనులు ఇంకా పూర్తి కాలేదని వాయిదా పడింది, ఓజీ చిత్రం మాత్రమే విడుదల అవుతుంది.