Akhanda 2 Overseas Collection: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) , బోయపాటి శ్రీను(Boyapati srinu) కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie) కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్, అందులో ఎలాంటి సందేహం లేదు. నిర్మాతకు విడుదలకు ముందే నష్టాలు. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఛేదించి ఈ సినిమాని విడుదల చేశారు. ఓటీటీ రైట్స్ కూడా సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో కేవలం 35 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయింది. ఇక అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు వచ్చిన నష్టాలను ఒకసారి లెక్కగడితే 40 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో రావడం, బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ కి మన టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడం తో ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చాయి. దాదాపుగా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా నార్త్ అమెరికా లో నిన్నటితో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ మార్కుని కూడా అందుకుంది. దీంతో బాలయ్య సీనియర్ హీరోలలో ఎవరికి సాధ్యం అవ్వని రికార్డు ని నెలకొల్పిన వాడయ్యాడు. వరుసగా 5 సార్లు నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్ల మార్కు ని అందుకున్న ఏకైక సీనియర్ హీరో గా చరిత్ర సృష్టించాడు. అంతే కాదు, వరల్డ్ వైడ్ గా ఆయన ‘అఖండ 2’ తో 5 సార్లు వంద కోట్ల గ్రాస్ అందుకున్న ఏకైక సీనియర్ హీరో గా కూడా మరో అరుదైన రికార్డుని అందుకున్నాడు. అఖండ, వీర సింహా రెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి, అఖండ 2..ఈ 5 సినిమాలు వరల్డ్ వైడ్ గా 100 గ్రాస్ ని అందుకోవడమే కాకుండా, నార్త్ అమెరికా లో 1 మిలియన్ మార్కుని అందుకున్నాయి.
చిరంజీవి కి కూడా ఇలాంటి రికార్డు ఉండేది. కానీ మధ్య లో ఆచార్య చిత్రం అటు వరల్డ్ వైడ్ గా వంద కోట్ల గ్రాస్ ని అందుకోలేదు, నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్ మార్కుని కూడా అందుకోలేదు. అందుకే చిరంజీవి కి ఈ రేర్ ఫీట్ మిస్ అయ్యింది. ఈ రికార్డుని భవిష్యత్తులో కూడా ఎవ్వరూ బ్రేక్ చేయలేరేమో. ఏది ఏమైనా బాలయ్య ‘అఖండ’ సినిమా నుండి ఆడియన్స్ లో బలమైన విశ్వాసాన్ని సంపాదించాడు అనే చెప్పాలి. ఒకప్పటి బాలయ్య అయ్యుంటే, ‘అఖండ 2’ కి వంద కోట్ల గ్రాస్ అసలు వచ్చేది కాదు. బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారంటీ గా ఉంటుంది అని జనాలు ఇప్పుడు నమ్ముతున్నారు. అందుకే మినిమమ్ గ్యారంటీ వసూళ్లు వస్తున్నాయి.