Akhanda 2 Collection Day 8: కొన్ని సినిమాలు హిందీ భాషలో సక్సెస్ అవుతాయో లేదో తెలియదు, కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అలా రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రాన్ని కూడా హిందీ లో విడుదల చేశారు. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా సనాతన ధర్మం అనేది సెన్సిటివ్ టాపిక్ అయ్యింది కాబట్టి, నార్త్ ఇండియన్స్ లో సనాతన ధర్మం పై విపరీతమైన నమ్మకం ఉంది కాబట్టి, ‘అఖండ 2’ ఆ కాన్సెప్ట్ మీద తెరకెక్కడం తో కచ్చితంగా వర్కౌట్ అవుతుందేమో అనే ఆశతోనే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రొమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేశారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిందీ లో చేసిన ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ మీమ్.
అయినప్పటికీ కూడా ఈ సినిమాకు అవన్నీ కలెక్షన్స్ రప్పించడం లో ఏ మాత్రం ఉపయోగపడలేదు. 8 రోజులకు గాను ఈ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి 65 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. మొదటి రోజు 12 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, రెండవ రోజు 15 లక్షలు, మూడవ రోజు 18 లక్షలు , నాల్గవ రోజున 7 లక్షలు, ఐదవ రోజున 5 లక్షలు, ఆరవ రోజున 4 లక్షలు, 7వ రోజున 3 లక్షలు, 8వ రోజున 1 లక్ష రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది అట ఈ చిత్రం. ఓవరాల్ గా 65 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ప్రొమోషన్స్, డబ్బింగ్ కోసం చేసిన ఖర్చు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అందులో పది శాతం వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు బాలీవుడ్ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసారో అనేది.
రీసెంట్ గానే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి వారణాసి టూర్ కి వెళ్లారు. అక్కడ అఖండ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు అయిన ఖర్చులను కూడా ఈ చిత్రం రాబట్టి ఉండదేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘అఖండ’ చిత్రాన్ని కూడా మన తెలుగు లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయిన కొన్ని రోజులకు హిందీ లో విడుదల చేశారు. దానికి ఇంతకంటే దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా ఫలితాన్ని చూసి కూడా ఈ చిత్రాన్ని హిందీ లో డబ్ చేయాలి అనే ఆలోచన బోయపాటి శ్రీను కి రావడం, నిజంగా సాహసం అనే చెప్పాలి.