Akhanda 2 Movie 4 days Collections: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ వైపు అడుగులు వేస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ చిత్రం కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు భారీ గా ఉండడం తో పాటు, వరుస సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. టాక్ లేని సినిమా కాబట్టి సోమవారం నుండి ఈ చిత్రం కచ్చితంగా డౌన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మరీ ఇంత దారుణంగా డౌన్ అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. అన్ని ప్రాంతాల మీద, సీడెడ్ లో వచ్చిన వసూళ్లు కాస్త డీసెంట్ రేంజ్ అని చెప్పొచ్చు. ఈ ప్రాంతం లో నాల్గవ రోజున 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక కృష్ణా జిల్లా లో అయితే ప్రతీ ప్రాంతం లోనూ డెఫిసిట్స్ పడ్డాయి. అంటే థియేటర్స్ రెంట్స్ కూడా రీకవర్ అవ్వలేదట. అందుకే ఈ చిత్రానికి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఈ జిల్లా నుండి వచ్చాయి. అది కూడా కొన్ని ప్రాంతాల్లో కమీషన్ బేసిస్ మీద తీసుకోవడం వల్లే ఆ మాత్రం అయినా వచ్చాయట. లేదంటే కేవలం నాలుగు లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే ఈ చిత్రానికి నాల్గవ రోజున కృష్ణా జిల్లా నుండి వచ్చేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి నిన్న 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇక గోదావరి జిల్లాల్లో అయితే గ్రాస్ వసూళ్లు రావడమే గగనం అయిపోయింది. అలా అన్ని ప్రాంతాల్లో దారుణమైన వసూళ్లను నమోదు చేసుకున్న ఈ చిత్రానికి నాల్గవ రోజున రిటర్న్ జీఎస్టీ కలిపితే 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం ఫుల్ రన్ లో 60 కోట్ల షేర్ వసూళ్లను కూడా రాబట్టడం కష్టమే అని అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 104 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే కచ్చితంగా ఈ చిత్రం 44 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చూసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఓవర్సీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రకారం చూస్తే ఈ సినిమాలు నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రావడం చాలా కష్టం అని తెలుస్తోంది.