Akhanda 2 First Day Collections: బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ 2’ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా కలెక్షన్స్ మీద కొంత వరకు దెబ్బ పడిందనే చెప్పాలి. మొదటి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని వసూలు చేస్తుందని చాలామంది అనుకున్నప్పటికి మేకర్స్ పెట్టుకున్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి. మొదటిరోజు ప్రీమియర్స్ తో కలిపి 59 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే మరో 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరమైతే ఉంది…ఇక దానికోసమే సినిమా మేకర్స్ మొదటి రోజు కలెక్షన్స్ మీద అంత పెద్దగా సంతృప్తి చెందడం లేదట. సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయడం కూడా ఈ సినిమా కలెక్షన్స్ మీద దెబ్బ కొట్టిందని పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నార్త్ ప్రేక్షకుల్లో సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుందని భావించిన మేకర్స్ కి కొంత వరకు నిరాశే మిగిలింది. ఎందుకంటే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది… ఇక ఈ సినిమాకి దాదాపు 180 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించారట. ఈ మూవీ ఆ బడ్జెట్ ని రికవరీ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
బోయపాటి శ్రీను తన మార్క్ ఆఫ్ మేకింగ్ తో ఈ సినిమాని సక్సెస్ఫుల్గా నిలిపే ప్రయత్నం చేసినప్పటికి సినిమాలో కంటెంట్ పెద్దగా లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప గొప్పగా ఉందని మాత్రం చెప్పడం లేదు. ఇక బాలయ్య బాబు సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగనే చెప్పాలి.
ఇక బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ మాస్ ఫీస్ట్ గా మిగులుతోంది. వల్ల సినిమాల్లో యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోర గా తన నట విశ్వరూపాన్ని చూపించారని చెబుతున్నారు.
ఇక చాలామంది భక్తిభావం కలిగినవారు. సంతాన ధర్మాన్ని నమ్మినవాళ్లు ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న కూడా ఈ వారం రోజుల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతోంది అనేదాని మీదనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది…