Akhanda 2 Opening Collections: మన టాలీవుడ్ లో సీక్వెల్స్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవరం లేదు. మన టాలీవుడ్ లో కంటే నార్త్ ఇండియా లో సీక్వెల్స్ కి క్రేజ్ విపరీతంగా ఉంది. కానీ ప్రతీ సీక్వెల్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటే పెద్ద పొరపాటే. బాహుబలి 2 , పుష్ప 2 , KGF చాప్టర్ 2 వంటివి అనివార్యం. కచ్చితంగా రావాల్సిందే, ఎందుకంటే జనాల్లో ఈ ఫ్రాంచైజ్ సినిమాలకు ఏర్పడిన క్రేజ్, బ్రాండ్ ఇమేజ్ అలాంటిది మరి. అలా అని ప్రతీ సినిమాకు సీక్వెల్ తీస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు అనడానికి మరో ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన ‘అఖండ 2′(Akhanda 2 Movie). 2021 వ సంవత్సరం లో విడుదలైన ‘అఖండ’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదలైనప్పటికీ, ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. టీవీ టెలికాస్ట్ లోనూ, ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. అలా ఆడియన్స్ బాగా రీచ్ అయిన సినిమా కావడం తో, అందులోనూ సీక్వెల్ కి స్కోప్ ఉన్న సినిమా కూడా కావడం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు బోయపాటి. మొదట్లో ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. కానీ ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొకటి విడుదల అయ్యే కొద్దీ ఈ సినిమా పై అంచనాలు తగ్గిపోతూ వచ్చాయి. ఎందుకంటే ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. ఫలితంగా నిన్న విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా దారుణంగానే వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమా 2016 లో విడుదలైన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికంటే తక్కువ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి.
ప్రాంతాల వారిగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 7 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి 5 కోట్ల 30 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 3 కోట్ల 40 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 2 కోట్ల 40 లక్షలు, తూర్పు గోదావరి నుండి 2 కోట్ల 19 లక్షలు, పశ్చిమ గోదావరి నుండి కోటి 55 లక్షలు, కృష్ణా జిల్లా నుండి కోటి 70 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి కోటి 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 25 లక్షలు, ఓవర్సీస్ నుండి 2 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా రిటర్న్ జీఎస్టీ కలుపుకుంటేనే. వర్త్ షేర్ పాతిక కోట్ల కంటే తక్కువ అట. సర్దార్ గబ్బర్ సింగ్ కి ఆ రోజుల్లోనే వర్త్ షేర్ 32 కోట్ల రూపాయిల వరకు వచ్చింది.