Akhanda 2 advance bookings: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం, ఎన్నో అడ్డంకులను దాటుకొని, ఎట్టకేలకు నేడు ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రం పై మొదటి నుండి ఫాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి కానీ. జనరల్ ఆడియన్స్ లో మాత్రం అనుకున్నంత రేంజ్ హైప్ రాలేదు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా ఆడియన్స్ ని ఆకర్షించలేదు. పాటలు కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ సినిమా ఒకసారి వాయిదా పడడంతో ఆడియన్స్ లో ఈ చిత్రం గురించి బాగా చర్చించుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హైప్ బాగా పెరిగిపోయింది. నందమూరి అభిమానుల్లో కూడా కసి బాగా పెరిగింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరిగాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం సీనియర్ హీరోల సినిమాల క్యాటగిరీ ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందట. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు విడుదల తేదీని ప్రకటించినప్పటికీ కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే సాధారణమైన విషయం కాదు. ఒక్క హైదరాబాద్ సిటీ లోనే ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 7 కోట్ల రూపాయిల గ్రాస్ బుకింగ్స్ ద్వారా వచ్చాయట. ఓవరాల్ నైజాం ప్రాంతం అడ్వాన్స్ బుకింగ్స్ 8 కోట్ల రూపాయలకు పైగా ఉందని అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీమియర్ షోస్ + రెగ్యులర్ షోస్ కి బలంగానే జరిగాయట. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నా లెక్కల ప్రకారం కేవలం తెలుగు రాష్ట్రాలు మరియు కర్ణాటక ప్రాంతం నుండి ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ 20 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చని, వరల్డ్ వైడ్ గా పాతిక కోట్ల రూపాయలకు అడ్వాన్స్ బుకింగ్స్ రాత్రి సమయానికి జరగొచ్చని అంటున్నారు.
ఇక సినిమా విడుదలైన తర్వాత మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఇంకా ఎక్కువ గ్రాస్ కూడా రావొచ్చని అంచనా వేస్తున్నారు. నిర్మాతలు ధైర్యంగా ప్రీమియర్ షోస్ వేస్తున్నారంటే, సినిమా ఔట్పుట్ మీద వాళ్లకు ఏ రేంజ్ నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 180 నుండి 200 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.