Akhanda 2 Advance Bookings: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం ఎట్టకేలకు ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ విషయాన్నీ మేకర్స్ నిన్న రాత్రి అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు. డిసెంబర్ 5న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మరో గంటలో షోస్ మొదలు అవుతాయి అనుకుంటున్న సమయం లో ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో డీలాపడిన నందమూరి అభిమానులు, నిన్నటి ప్రకటన తో సంబరాలు చేసుకున్నారు. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు మేకర్స్. తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని గంట క్రితమే మొదలు పెట్టగా, టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి.
మొదటి రిలీజ్ అప్పుడు మొదలు పెట్టిన అడ్వాన్స్ బుకింగ్స్ కంటే, రెండవసారి మొదలు పెట్టిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువ స్పీడ్ ఉన్నాయి. ఊపు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల నుండి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చేలా కనిపిస్తోంది. ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలు అవ్వలేదు. రేపు ఉదయం ప్రారంబిస్తారట. ఇక ఆ బుకింగ్స్ కూడా మొదలయ్యాక గ్రాస్ 20 కోట్ల రూపాయలకు ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవర్సీస్ లో కూడా నిన్ననే బుకింగ్స్ మొదలు పెట్టారు. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించిన అతి తక్కువ సమయం లోనే లక్ష డాలర్లను అందుకుంది. అయితే ఇంతకు ముందు బ్రేక్ ఈవెన్ నెంబర్ రెండున్నర మిలియన్ డాలర్లు ఉండగా, ఇప్పుడు వాయిదా పడిన తర్వాత 1.5 మిలియన్ డాలర్స్ కి స్థిరపడింది. అంటే కేవలం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఏమి జరగబోతుందో చూడాలి.
ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబందించిన గ్రాండ్ రిలీజ్ టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ లోని యాక్షన్ షాట్స్ చూసిన తర్వాత ఆడియన్స్ కి అనిపించినా ఫీలింగ్ ఒక్కటే. అతికి హద్దులు కాస్త అయినా ఉండాలి కదా?, మనిషిని అరచేతిలో తలక్రిందులుగా పెట్టుకొని, దిష్టి తీసి తలని నేలకేసి కొట్టడం ఏంటి ?, ఎంత అఘోర అయినా, సూపర్ మ్యాన్ కాదు కదా, మరీ ఇంత దారుణమా అంటూ ట్రోల్ చేస్తున్నారు . సినిమాలో ఇలాంటి యాక్షన్ షాట్స్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా ఉండేలా అనిపిస్తోంది. అదే కనుక జరిగితే సోషల్ మీడియా లో ఇండియా వైడ్ గా ట్రోల్స్ మామూలు రేంజ్ లో ఉండవు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.