Akash Puri: పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ ప్రస్తుతం హీరోగా మారాడు. తన చిన్ననాడు బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ గా నటించి మెప్పించాడు. ఇందులో తన చెల్లెలు పవిత్రతో లవర్ గా నటించాడు. చెల్లెలుతో లవర్ గా నటించడానికి ఇష్టపడకపోయినా సినిమా కావడంతో ఫర్వాలేదని తండ్రి చెప్పడంతో ఒప్పుకున్నాడట. అందులో వారు చేసిన హంగామా అందరికి గుర్తుండే ఉంటుంది. అన్నాచెల్లెళ్లు లవర్స్ గా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అప్పటి నుంచే నటనలో ఆకాష్ ఎంతో పరిణతి చూపించిన విషయం తెలిసిందే.

చిరుత సినిమాలో కూడా చిన్ననాటి రాంచరణ్ గా ఆకాష్ నటించాడు. ఆ సినిమాలో పలు సన్నివేశాల్లో ఆకాష్ ను చూసిన వాళ్లమ్మ ఏడ్చేసిందట. జైల్లో గిన్నె పట్టుకుని అన్నం కోసం వెళ్లడం అక్కడ అన్నం లాగేయడం వంటి సన్నివేశాల్లో ఆకాష్ ను చూసిన వాళ్లమ్మ బాధపడిందట. తన కొడుకు నిజంగానే అలాంటి సీన్లలో జీవించినట్లుగా నటించడంతో అతడి గురించి బెంగ పెట్టుకుందట. ఆకాష్ నటనకు అందరు ఫిదా అయ్యారు. అలా చిన్న నాటి నుంచే ఆకాష్ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను కట్టిపడేశాడు.
Also Read: Pooja Hegde: నీ బిల్లు నువ్వే కట్టుకో అని పూజ హెగ్డే కి షాక్ ఇచ్చిన టాప్ నిర్మాత
నేనింతే సినిమా సమయంలో ఆకాష్ టీ బాయ్ గా మారి అందరికి అందించాడట. దీంతో రవితేజ నువ్వు టీ బాయ్ ఏంటి అని దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడట. పూరీ జగన్నాథ్ పని విషయంలో చూపే శ్రద్ధ అలా ఉంటుంది. పని కోసం కొడుకైనా ఎవరైనా సరే చేయాల్సిందే. అంతటి కమిట్ మెంట్ ఉన్న దర్శకుడు కాబట్టే ఇండస్ర్టీలో తన సత్తా చాటుతున్నాడు. సినిమాల పరంగా తీసుకుంటున్న శ్రద్ధతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆకాష్ బాల నటుడిగా తన సత్తా చాటాడు. ప్రస్తుతం హీరోగా కూడా తనదైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి ఆశయాలకు అనుగుణంగానే ఆకాష్ కూడా ముందుకు వెళ్తున్నాడు. కానీ బుజ్జిగాడు సమయంలో చెల్లెలికి లవర్ గా చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడట. తండ్రి నటనే కదా అని చెప్పడంతో ఆయన మాట కాదనలేక నటించాడు. చెల్లెలితో కలిసి నటించే సమయంలో పడిన ఇబ్బందిని ఇప్పటికి కూడా గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు.
Also Read:Anasuya Bharadwaj: అనసూయను అలాంటి డ్రెస్సులో ఆ డైరెక్టర్ చూడాలనుకున్నాడట!
[…] Also Read: Akash Puri: చెల్లితో లవర్ గా నటించడానికి ససే… […]