Vidamuyarchi Movie : తమిళనాడు లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు తల అజిత్. ఎంజీఆర్, రజినీకాంత్ తర్వాత తమిళనాడు లో అంతటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్ ఒక్కడే అని అందరూ అంటుంటారు. ఆయన కెరీర్ లో ఎక్కువ శాతం ఫ్లాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. అందరి హీరోలు లాగా ఈయన తన సినిమాలకు ప్రొమోషన్స్ చేయడు కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడానికి కూడా ఇష్టపడదు. అయినప్పటికీ కూడా ఆయన సినిమాలకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంటుంటాయి. 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘తూనీవు’ చిత్రం తర్వాత అజిత్ నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘విడాముయార్చి’.
ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 7వ తేదికి వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. కేవలం ఒక్క తమిళనాడు నుండే ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. వరల్డ్ వైడ్ గా చూస్తే 22 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. తమిళనాడు లో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ సాధించే మూవీ అవుతుందని అంటున్నారు. తెలుగు లో ఈ చిత్రం ‘పట్టుదల’ అనే పేరుతో విడుదల అవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని దుబాయి లో నేడు ఏర్పాటు చేసారు. ఈ ప్రివ్యూ షో నుండి వచ్చిన టాక్ ఇప్పడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా నుండి అభిమానులు ఒక రేంజ్ ఇంట్రడక్షన్ సన్నివేశం, బీభత్సమైన హీరోయిజం ఎలివేషన్స్, మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ సన్నివేశం వంటివి ఆశించొద్దు అని అంటున్నారు. ఒక మంచి హాలీవుడ్ థ్రిల్లర్ ని చూసిన అనుభూతి కలుగుతుంది కానీ, అభిమానులు కోరుకునే ఎలివేషన్స్ ఈ చిత్రంలో ఉండవట. అభిమానులు ఇది దృష్టిలో పెట్టుకొని భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లకుంటే మంచిది. సినిమాని సినిమాలాగే చూస్తే ఎలాంటి నష్టం లేదు. స్టార్ హీరో కాబట్టి ఇవన్నీ కచ్చితంగా ఉండాల్సిందే అనుకుంటే మాత్రం నిరాశ పడుతారు. వళ్ళు గగురుపొడిచే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రం లో ఉంటాయి. కానీ అవన్నీ సందర్భానికి తగ్గట్టుగానే ఉంటాయి తప్ప, అవసరం లేకపోయినా ఇరికించేటట్టు మాత్రం ఉండదు. అజిత్ అద్భుతంగా నటించాడట, ఫ్లాష్ బ్యాక్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. మరి ప్రేక్షకుల నుండి కూడా ఇలాంటికి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.