Ajith Daughter Anikha Surendran: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. బుట్ట బొమ్మ టైటిల్ తో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో అనిఖా సురేంద్రన్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా బుట్టబొమ్మ టీజర్ విడుదల చేశారు. ఆటో డ్రైవర్ ప్రేమలో పడ్డ మిడిల్ క్లాస్ అమ్మాయిగా అనిఖా సురేంద్రన్ కనిపించారు. ఖైదీ(2019), మాస్టర్ ఫేమ్ అర్జున్ దాస్, సూర్య వశిష్ట లీడ్ రోల్స్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎవరీ అనిఖా సురేంద్రన్? ఈమె నేపథ్యం ఏమిటనే చర్చ మొదలైంది.

అజిత్ హీరోగా 2019లో విడుదలైన విశ్వాసం మూవీతో అనిఖా సురేంద్రన్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ మూవీలో అనిఖా అజిత్ కూతురుగా నటించారు. నయనతార హీరోయిన్ గా చేశారు. దర్శకుడు శివ తెరకెక్కించిన విశ్వాసం తెలుగులో కూడా ఆదరణ దక్కించుకుంది.కేరళ కుట్టి అయిన అనిఖా సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. 2007లో విడుదలైన చోటా ముంబై మూవీలో వెండితెరపై మొదటి సారి కనిపించారు. అయితే ఆమె పూర్తి స్థాయిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిత్రం ‘కదా తుండరున్ను’.
మలయాళంలో వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనిఖా సురేంద్రన్… అజిత్ ‘ఎంతవాడు కానీ’ మూవీతో కోలీవుడ్ కి పరిచయమయ్యారు. తమిళ, మలయాళ భాషల్లో చిత్రాలు చేస్తున్నారు. ఇక తెలుగులో అనికా ఫస్ట్ మూవీ ది ఘోస్ట్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున కాపాడే టీనేజర్ గా అనిఖా సురేంద్రన్ నటించారు. ది ఘోస్ట్ మూవీ ఫలితం ఎలా ఉన్నా అనిఖా సురేంద్రన్ నటనకు ప్రశంసలు దక్కాయి.

బుట్ట బొమ్మ మూవీతో హీరోయిన్ గా మారడం జరిగింది. మలయాళ కుట్టి అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా తెలుగులో లాంఛ్ కావడం విశేషం. ఇక 17 ఏళ్లకే అనిఖా సురేంద్రన్ హీరోయిన్ అయ్యారు. అమ్మడుకి సక్సెస్ దక్కితే సౌత్ ఇండియాను ఏలేయడం ఖాయం. ఆకట్టుకునే నటన, పక్కింటి అమ్మాయిలా తోచే హోమ్లీ లుక్ అనిఖాకు ప్లస్. బుట్ట బొమ్మ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది. హీరోయిన్ గా ఆమె ఫస్ట్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. త్వరలో బుట్ట బొమ్మ ప్రేక్షకుల ముందుకు రానుంది.