Ajith : తమిళ హీరో అజిత్(Thala Ajith) మల్టీ టాలెంటెడ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. సినిమాల్లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, తమిళనాడు లో MGR , సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) తర్వాత అంతటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోగా అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఆయన రేంజ్ కి తగ్గ సినిమాలు ఇటీవల కాలం లో పడడం లేదు కానీ, పడితే మాత్రం పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే అజిత్ ఖాళీ సమయంలో రేసింగ్ వంటివి చేయడం అతనికి అలవాటు. దుబాయ్ లో జరిగిన రేసింగ్ ఈవెంట్ లో మన ఇండియా కి బ్రాన్జ్ మెడల్ ని కూడా తీసుకొచ్చాడు. ఇటీవల కాలంలో రెండు మూడు సార్లు రేసింగ్ లో ప్రమాదానికి కూడా గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరో అజిత్..ఫ్యాన్స్ కన్నీళ్లు!
ఇదంతా పక్కన పెడితే అజిత్ కి అద్విక్ అనే కొడుకు ఉన్నాడు. చిన్న తనం నుండే ఆటల్లో ఇతనికి గొప్ప ప్రావిణ్యం లభించింది. స్కూల్ లో జరిగిన ఎన్నో ఈవెంట్స్ లో అద్విక్ గోల్డ్ మెడల్స్ ని కూడా సాధించాడు. తన తండ్రికి లాగానే, అద్విక్ కి కూడా రేసింగ్ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. చిన్నతనం నుండి తన తండ్రి రేసింగ్ ని చూస్తూ పెరిగి, వాటిపై ప్రత్యేకమైన మక్కువ ఆడ్విక్ కి కలిగింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే చెన్నై లో జరిగిన మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్ అరేనా(MIKA) & మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో చిన్న పిల్లల కార్ రేస్ ఈవెంట్స్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో అజిత్ కుమారుడు అద్విక్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో లీక్ అవ్వగా, అవి బాగా వైరల్ అయ్యాయి.
అజిత్ అభిమానులు అద్విక్ రేసింగ్ ని చూసి ఎంతో మురిసిపోతున్నారు. చిన్నతనం లోనే ఈ రేంజ్ టాలెంట్ ని కనబరుస్తుంటే, ఇక పెద్దయ్యాక ఏ స్థాయికి వేళ్తాడో అని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అజిత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్..బ్యాడ్..అగ్లీ'(Good Bad Ugly Movie) చిత్రం ఈ నెల 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. అజిత్ కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అజిత్ గత చిత్రం ‘విడాముయార్చి’ ఫ్లాప్ అయ్యినప్పటికీ, ఈ సినిమా బిజినెస్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. తమిళనాడు లో మొదటిరోజు ఈ చిత్రం ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అక్కడి ట్రేడ్ పండితులు
Also Read : కోలీవుడ్ స్టార్ అజిత్ కూతురు లేటెస్ట్ ఫోటోలు చూశారా..? స్టార్ హీరోయిన్స్ కూడా ఈమె అందం చూసి అసూయపడతారు!
— Suresh Chandra (@SureshChandraa) April 3, 2025