Rajendra Prasad : వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువ పెరుగుతుంది, మతి స్థిమితం పూర్తిగా పోతుంది. ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు అనేందుకు ప్రముఖ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఉదాహరణగా నిలిచాడు. ఈమధ్య కాలం లో స్టేజి మీద ఈయనకు నోరు జారడం అలవాటు అయిపోయింది. తోటి నటీనటుల గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం ఆయన గౌరవాన్ని బాగా తగ్గించేస్తుంది. సోషల్ మీడియా లో నెటిజెన్స్ రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ని భూతేంద్ర ప్రసాద్ అంటూ సంబోధిస్తున్నారంటే ఆయన మీద ఈమధ్య కాలం లో ఎలాంటి వ్యక్తిరేకత ఏర్పడిందో అర్థం అవుతుంది. గతం లో రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) పై సభా మర్యాద కూడా పాటించకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. దీనిపై అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ ని నెటిజెన్స్ ఏకిపారేశారు. దీంతో ఆయన దిగొచ్చి క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read : డేవిడ్ వార్నర్ ని అడ్డమైన బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!
నిన్న లెజండరీ డైరెక్టర్ SV కృష్ణా రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగం లో రెండు సార్లు తన తోటి నటీనటులపై నోరు జారాడు. ముందుగా ఆయన అలీ(Comedian Ali) గురించి మాట్లాడిన మాటలు అత్యంత నీచంగా అనిపించాయి. ‘ఏరా అలీ గా..ఇటు రా ల****కా’ అంటూ రాజేంద్ర ప్రసాద్ బూతులు మాట్లాడాడు. దీనిని అలీ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. వాళ్ళ మధ్య ఒకరిని ఒకరు తిట్టుకునేంత స్వాతంత్రం ఉండొచ్చు, కానీ సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. అలీ కూడా ఇండస్ట్రీ లో ఎంతో కాలం నుండి ఉంటున్నాడు. ఆయనకు కూడా లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు, కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అయినా రాజేంద్ర ప్రసాద్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇదే సభలో అలీ ని మాత్రమే కాదు, ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రి రోజా(Roja Selvamani) పై కూడా నోరు జారాడు.
ఆయన మాట్లాడుతూ ‘దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒక మహిళ పట్ల కనీస గౌరవం అయినా ఇవ్వాలి కదా?, అకస్మాత్తుగా రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా మారిపోయాడు?, వయస్సు మీద పడితే ఎవరైనా ఇంతేనా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ ని ఒక నటుడిగా ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, ఎవర్ గ్రీన్ నటుడు, ఇండస్ట్రీ లో లెజండరీ నటుడు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అలాంటి నటుడు మొన్న ఒక్కసారి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు మరోసారి కూడా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి వచ్చేలా ఉంది. పెద్ద వయస్సులో ఎన్నో అత్యుత్తమ పురస్కారాలకు అర్హుడైన రాజేంద్ర ప్రసాద్ రోజురోజుకి తన విలువను తగ్గించేసుకుంటున్నాడని ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా బాధపడుతున్నారు.