Aishwarya Rai Bachchan’s Royal Look: ఒకప్పటి క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం చేస్తున్న సినిమా “పొన్నియన్ సెల్వన్”( Ponniyin Selvan). ఈ సినిమాలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. అందరిలో కల్లా… ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) పాత్ర కీలకం. అయితే, ఐశ్వర్య రాయ్ సెట్ లో ఉండగా ఆమె ఫోటో ఎవరో తీసి లీక్ చేశారు. రాణి పాత్రలో ఐశ్వర్య రాయ్ నిజంగా రాణీలానే ఉంది.
ముఖ్యంగా ఆమె గెటప్ అదిరిపోయింది. అయితే, ఐశ్వర్య రాయ్ ఫోటో లీక్ కావడంతో మణిరత్నం తన టీం పై సీరియస్ అయ్యాడు. సినిమా సెట్ లోకి ఇక బయట వ్యక్తులను ఎవరని అనుమతించేది లేదు అని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. చివరకు ఫుడ్ తెచ్చే బాయ్స్ ను కూడా సెట్ లోకి అనుమతించడం లేదు.
దాంతో ఎంతటి స్టార్లు అయినా తమ ఫుడ్ ను తామే పెట్టుకుని తినాల్సి వస్తోందట. మణిరత్నం కాబట్టి.. మొత్తానికి స్టార్లు అందరూ బాగానే కోపరేట్ చేస్తున్నారు. అన్నట్టు ఈ “పొన్నియన్ సెల్వన్” సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు.
ఏది ఏమైనా తమిళ స్టార్ హీరోలు కార్తీ, విక్రమ్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు, అలాగే త్రిష, ఐశ్వర్య, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళనాట బాగా ప్రాచుర్యం ఉన్న ఓ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇది చోళుల కథ కాబట్టి.. కథలో చాలా అంశాలు ఉంటాయి.
ఇక ఐశ్వర్య రాయ్ చోళుల మహారాణిగా నటిస్తోంది. 47 ఏళ్ల ఐశ్వర్య రాయ్ ఈ మధ్య సినిమాలను తగ్గించింది. నిజానికి ఈ సినిమా కూడా చేయడానికి ఆమె అంగీకరించలేదు. కానీ మణిరత్నం దర్శకుడు కావడంతో ఆమె నటించడానికి ఒప్పుకొంది.