Aishwarya Lekshmi: తమిళనాడు లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ మోస్ట్ యంగ్ హీరోయిన్స్ లో ఒకరు ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi). ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘గాడ్సే’, ‘మట్టికుస్తి’ సినిమాల ద్వారా పరిచయం. సోషల్ మీడియా ని ఉపయోగించే తెలుగోళ్లకు ఈమె తెలియకుండా ఉండదు. చాలా సాధారణమైన లుక్స్ తో మన పక్కింటి అమ్మాయి లాగా అనిపించే ఈమె, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఇన్ని రోజులు పోషిస్తూ వచ్చింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ‘సంబరాల ఏటి గట్టు’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఆమెకు తెలుగు లో రెండవ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత ఆమె టాలీవుడ్ మార్కెట్ లో కూడా పాగా వేసినా ఆశ్చర్యంపోనక్కర్లేదు. అయితే రీసెంట్ గానే ఈమెకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆ ఫోటోలలో ఆమె గర్భం దాల్చి ఉండడాన్ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఐశ్వర్య లక్ష్మి ఎప్పుడు పెళ్లి చేసుకుంది?, కనీసం ఆమె డేటింగ్ లో ఉంటున్నట్టు వార్తలు కూడా మా వరకు రాలేదు?, సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి అని ఆ ఫోటో క్రింద కామెంట్ సెక్షన్ లో నెటిజెన్స్ ప్రశ్నించారు. అయితే ఇది నిజమైన గర్భం కాదని ఆ తర్వాత తెలిసిందే. కొత్త సినిమాలో ఆమె రేఖ అనే క్యారక్టర్ చేస్తుంది. ఆ క్యారక్టర్ కి సంబంధించిన గెటప్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఐశ్వర్య లక్ష్మి చాలా కాలం నుండి ప్రముఖ నటుడు అర్జున్ దాస్ తో ప్రేమాయణం నడుపుతుందని, అతనితో డేటింగ్ చేస్తుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
ఈ క్రమం లో ఆమెని ఇలాంటి ఫోటోలలో చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు ఫ్యాన్స్. ఇకపోతే రీసెంట్ గానే ఈమె ‘మామన్’ అనే తమిళ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. సూరి హీరో గా నటించిన ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తెలుగు లో ఆమె సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం. ఈ సినిమా సక్సెస్ అయితే ఇక ఐశ్వర్య లక్ష్మి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు.
View this post on Instagram