Game changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీకై అవి తెగ వైరల్ గా మారింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రంలోని పాటల పిక్చరైజేషన్ గురించి ఇంటర్వ్యూస్ లో అద్భుతంగా చెప్తున్నాడు. డైరెక్టర్ శంకర్ పాటలతో జనాలను సరికొత్త ప్రపంచం లోకి తీసుకెళ్లినట్టు అనిపించింది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ‘జరగండి..జరగండి’ పాట గురించి మాట్లాడుతూ ఈ పాట అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. ప్రభుదేవా మాస్టర్ అద్భుతమైన డ్యాన్స్ కొరియోగ్రఫీ తో పాటు, శంకర్ విజన్ తో వేసిన సెట్స్ స్క్రీన్ మీద చూసినప్పుడు కలిగే అనుభూతి అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా ఈ పాటని తొలుత హనుమాన్ అనే గాయకుడితో పాడించారట. కానీ ఎందుకో ఆయన గొంతు తమన్ కి నచ్చలేదు. దీంతో ఆయన ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో ‘బంతి పూల జానకీ’ పాట పాడిన దలేర్ మెహందీ పాటని రిఫరెన్స్ గా తీసుకొని AI టెక్నాలజీని వాడి దలేర్ మెహందీ నే ఈ పాటని పట్టినట్టు రీ క్రియేట్ చేశామని తమన్ చెప్పుకొచ్చాడు. ఈమధ్య కాలం లో AI టెక్నాలజీ ని సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్ లో వాడుకుంటుంది. కల్కి చిత్రానికి కూడా అమితాబ్ బచ్చన్ తెలుగు లో సొంతంగా డబ్బింగ్ చెప్పలేదు. AI టెక్నాలజీ ని వాడి చెప్పించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మొదటి పాటని కూడా ఇతర భాషల్లో AI ద్వారా డబ్ చేయించినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎన్నో వస్తూనే ఉంటాయి.
ఇకపోతే ‘గేమ్ చేంజర్’ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల్లో మొదలు అవుతున్నాయి. హైదరాబాద్ మరియు తెలంగాణ జిల్లాల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇవి లైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో గంటకి నాలుగు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ బుకింగ్స్ ప్రారంభించిన తర్వాత గంటకి 20 వేలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. నైజాం ప్రాంతం లో ఆల్ టైం రికార్డు రావాలంటే కచ్చితంగా 18 కోట్ల రూపాయిల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రావాలి. గేమ్ చేంజర్ కి సమయం లేదు. మరి ఉన్న ఈ కాస్త సమయంలో ఆ రేంజ్ బుకింగ్స్ జరుగుతుందా అంటే ప్రస్తుతానికి డౌటే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ప్రస్తుతానికి అయితే మొదటి రోజు రికార్డు పుష్ప 2 ఖాతాలో ఉంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Ai magic in the game changer jaragandi jaragandi song you can come to the theaters two or three times just for this song
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com