Unstoppable With Nbk Prabhas: అన్ స్టాపబుల్ విత్ NBK రెండవ సీజన్ లో భారీ హైప్ తో వచ్చిన ఎపిసోడ్ ప్రభాస్ ఎపిసోడ్..ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ ఉంటుందని ప్రకటించారో అప్పటి నుండే ఈ ఎపిసోడ్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..వ్యూస్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టించిందని అందరూ అనుకున్నారు..కానీ నేడు ఆహా మీడియా ఛానల్ తమ యాప్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 లిస్ట్ వేస్తే అందులో ప్రభాస్ ఎపిసోడ్ లేకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది..ఈ ఎపిసోడ్ అప్లోడ్ చేసిన రోజు ప్రభాస్ ఫ్యాన్స్ తాకిడికి ఆహా యాప్ క్రాష్ అయ్యింది.

అక్కడే జరగాల్సిందంతా జరిగిపోయిందని అంటున్నారు విశ్లేషకులు..అప్లోడ్ చెయ్యగానే నెటిజెన్స్ ఆహా నుండి డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్ లో అప్లోడ్ చేసారు..ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ని చూద్దామా అని అతృతతో ఉన్న అభిమానులు టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని చూసేసారు..దాంతో ఆహా లో ప్రభాస్ ఎపిసోడ్ కి కావాల్సినంత వ్యూస్ రాలేదని అంటున్నారు విశ్లేషకులు.
ఇది ఇలా ఉండగా నిన్న ఆహా మీడియా ఈ వారం టాప్ లో ట్రేండింగ్ అవుతున్న షోస్ మరియు సినిమాల లిస్ట్ ని విడుదల చేసింది..ఈ లిస్ట్ అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ తో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ట్రెండ్ అవుతుంది..ఇక ఆ తర్వాత రెండవ స్థానం లో మాసూడ చిత్రం, మూడవ స్థానం లో సర్దార్ చిత్రం , నాల్గవ స్థానం లో ఓడేలా రైల్వే స్టేషన్ చిత్రం ట్రెండ్ అవుతున్నాయి.

ఇక వెబ్ సిరీస్ లలో సిన్ అనే సిరీస్ ట్రేండింగ్ అవుతుంది..విశేషం ఏమిటంటే గత ఏడాది ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ సీజన్ 1’ గ్రాండ్ ఫినాలే లో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎపిసోడ్ టాప్ 6 స్థానం లో కొనసాగుతుండడం విశేషం..కానీ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం ట్రేండింగ్ లో లేకపోవడమే బాధాకరం..ఈ ట్వీట్ వెయ్యగానే ఆహా మీడియా కి తీవ్రమైన నెగటివిటీ రావడం తో వెంటనే ఆ ట్వీట్ ని డిలీట్ చేసారు.