Agni OTT: ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఓటిటి లో మాత్రం తమ సత్తా చాటుతున్నాయి. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక కొత్త సినిమా ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంది.ఓటిటి లలో నిత్యం సరికొత్త వెబ్ సిరీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ సినిమాలు, మర్డర్ మిస్టరీస్ వంటివి చాలా రకాల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓటిటి లో ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఒకదానికి మించి మరొకటి బలమైన కథనాలతో, వణుకు పుట్టించే విలువలతో టాప్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ప్రస్తుతం ఓటిటి లో హారర్ సినిమాలు, థ్రిల్లర్, సస్పెన్స్ మిస్టరీ, గంటలోనే కథలు మారి ట్విస్టులు, మలుపులతో థ్రిల్లర్గా మారిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రోజుల ముందు ఓటిటి లో 122 నిమిషాలు నిడివి ఉన్న ఒక పవర్ ఫుల్ సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా టాప్ ట్రెండింగ్ సినిమాల లిస్టులో చేరింది. ఈ సినిమా కథ ఒక గంట తర్వాత చాలా థ్రిల్లర్గా అనిపిస్తుంది. 2024 లో రిలీజ్ అయిన అద్భుతమైన థ్రిల్లర్ సినిమాగా ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఒక గంట తర్వాత ఈ సినిమా కథ పూర్తిగా మారిపోతుంది. డిసెంబర్ 6న అగ్ని అనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రతీక్ గాంధీ, దివ్యేన్దు శర్మ, సయామి కేర్, జితేంద్ర జోషి, ఉదిత్ అరోరా కీలక పాత్రలలో కనిపించారు. ప్రతీక్ గాంధీ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా కథ అగ్నిమాపక సిబ్బంది చుట్టూ ఉంటుంది. ఒక గంట సమయం తర్వాత అగ్ని సినిమా కథ పూర్తిగా మారిపోతుంది. ఊహించని మలుపులతో చాలా రసవత్తంగా సాగుతుంది.
ఈ సినిమాలో అగ్నిమాపక సిబ్బంది ముంబైలోని పెద్ద భవనాలకు నిప్పు పెట్టడం లేదని, ఎవరో వాటిని కావాలనే తగలబెడుతున్నారని తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ ఒక గంట తర్వాత చాలా మారిపోయి చూసేవారికి త్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం ఓటిటి లో అందుబాటులో ఉన్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఊహించని రెస్పాన్స్ వస్తుంది. నిత్యం ప్రేక్షకులు డిఫరెంట్ గా ఉండే కథలను, హారర్ సినిమాలను, సస్పెన్స్ థ్రిల్లర్, ట్విస్టులు ఉండే సినిమాలను కోరుకుంటారు.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఓటిటి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. చిన్న నటీనటులు అయిన సరే కథ బాగుంటే ఆ సినిమాకు ఓటిటి లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే చాలా సినిమాలు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లలో ట్రెండ్ అవుతున్న సినిమాలలో అగ్ని సినిమా కూడా ఒకటి. మొదట్లో చూసినప్పుడు ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిన, ఒక గంట తర్వాత మాత్రం ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.