Akhanda 2 Aghoris: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై, డివైడ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. టాక్ డివైడ్ గా ఉన్నప్పటికీ , ఈ సినిమాకు డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, రెండవ రోజు 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా రెండు రోజుల్లో 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, మూడు రోజులు కలిపి 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రేపటి నుండి కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉండే అవకాశాలు లేకపోవడం, ఫుల్ రన్ లో కేవలం మరో 15 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో అఘోరాలు థియేటర్స్ కి వచ్చి, జనాల మధ్య కూర్చొని ఎంజాయ్ చేయడం హైలైట్ గా నిల్చింది. సినిమాలో బాలయ్య విలన్స్ ని చితకబాదుతుంటే, అఘోరాలు సీట్స్ మీద నుండి పైకి లేచి సందడి చేయడం చూసి కొంతమంది ప్రేక్షకులు భయపడి బయటకు పారిపోయారు. సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అఖండ చిత్రం లో చూపించిన విధంగా, నిజమైన అఘోర లకు అంతటి శక్తి ఉంటుందా?, ఇక్కడ థియేటర్ లో చూసిన అఘోర కేవలం ఒక వేషధారి మాత్రం గానే కనిపిస్తున్నాడు కానీ , నిజమైన అఘోర గా అనిపించడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వీరు థియేటర్ కు రావడం బహుశా మొదటి సారేమో. వారిని అలా రప్పించడమే కష్టం. యూపీలో వచ్చిన విభూతి కాషాయ యోగులు అఖండ తాండవం చూసి, సీట్ల నుండి లేచి కరతాళ ధ్వనులతో ఈ వేదభూమిలో మొదటి సారి పులకరిస్తుంటే.. శివయ్యగా నటించిన బాలయ్య జన్మసార్థకం అనిపించింది…#Akhanda2 #Akhanda2Thaandavam pic.twitter.com/11etQ4Nq1C
— Swathi Reddy (@Swathireddytdp) December 14, 2025