Bigg Boss 6 Telugu Surya: ఈ ఆదివారం ఎలిమినేటైన సూర్య అసలు రంగు బయటపెట్టాడు. తన లవర్స్ గా ప్రచారం అవుతున్న ఇనయా, బుజ్జమ్మలకు ఊహించని షాక్ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో సూర్య చేసిన కామెంట్స్ అతడి నిజస్వరూపం ఏమిటో బయటపెట్టాయి. ఈ సీజన్లో లవర్ బాయ్ ఇమేజ్ ఎంజాయ్ చేశాడు సూర్య. మొదటి వారం నుండి సూర్య అఫైర్స్ నడిపారు. ఆరోహిరావు ఎలిమినేట్ అయ్యే వరకు ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. అవసరమైనప్పుడల్లా హగ్గులు ఆరగించాడు. నాలుగో వారం ఆరోహిరావు ఎలిమినేట్ కాగా బాగా ఎమోషనల్ అయ్యాడు.

వెంటనే ఇనయాకు దగ్గరయ్యాడు. ఇనయా ఏకంగా బావ అంటూ ఓపెన్ గా తన ఇష్టం ప్రకటించింది. దీంతో కావాల్సినంత రొమాన్స్ ఎంజాయ్ చేశాడు. లవ్ ట్రాక్ ఎక్కువై ఇనయా గేమ్ పక్కన పెట్టిందని ఆరోపణలు రావడంతో ఒప్పందం ప్రకారం కొంచెం దూరమయ్యారు. మనోడు అనూహ్యంగా 8వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఆ రోజు ఇనయా ఏడ్చిన తీరు బిగ్ బాస్ చరిత్రలోనే హైలెట్. ఏదో సూర్య ఆమెకు శాశ్వతంగా దూరం అవుతున్నట్లు కన్నీరు పెట్టుకుంది. క్రిందపడిపోయి బిగ్ బాస్ మెయిన్ డోర్ వద్ద సూర్యా సూర్యా అంటూ కేకలు వేస్తూ ఏడ్చింది.
అంతా బాగానే ఉంది. సూర్య-ఇనయా తీరు చూశాక వారిని అమర ప్రేమికులుగా ప్రేక్షకులు భావించారు. మరోవైపు చాలా కాలంగా సూర్యతో సన్నిహితంగా ఉంటున్న బుజ్జమ్మతో కూడా ఘాడమైన బంధం ఉందని చెప్పాడు. హౌస్లో అనేక రంగులు చూపించిన సూర్య… ఇనయా, బుజ్జమ్మలకు బిగ్ షాక్ ఇచ్చాడు. అందరూ తనకు స్నేహితులు మాత్రమే అంటూ బిగ్ షాక్ ఇచ్చాడు. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయినే నేను వివాహం చేసుకుంటాను.

బుజ్జమ్మ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇక ఇనయాతో కూడా నాకుంది స్నేహం మాత్రమే. వాళ్లతో నాకు అఫైర్స్ అంటూ జరుగుతున్న ప్రచారం తన జీవితాన్ని నాశనం చేస్తుందని అన్నాడు. హౌస్లో అఫైర్స్ నడిపినా, బయట లవర్స్ ఉన్నారని చెప్పుకున్నా అది సెన్సేషన్ కోసం, ఆటలో రాణించడానికే అని సూర్య పరోక్షంగా హింట్ ఇచ్చాడు. నిజానికి లవర్ బాయ్ ఇమేజ్ బిగ్ బాస్ హౌస్లో బాగా ఉపయోగపడుతుంది. సూర్య విషయంలో మాత్రం బెడిసి కొట్టింది. బహుశా అతడు మల్టిపుల్ రిలేషన్స్ నడపడం కూడా కారణం కావచ్చు.