Kushi: సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్ కే ఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బేబీ’ సినిమా జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ సెలబ్రిటీస్ కూడా నచ్చడంతో స్పెషల్ ఈవెంట్లు పెట్టి మరీ అభినందించారు.
మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ ని తెగ ఖుషి చేసింది ఈ సినిమా. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం తరువాత ఇండస్ట్రీకి ఇప్పటివరకు తగిన హిట్ అయితే రాలేదు. ఆ తరువాత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఫ్లాపుల గానే మిగిలాయి. చిరంజీవి భోళ శంకర్ పై అందరూ ఆశలు పెట్టుకున్న అది డిజాస్టర్ గా మిగిలింది. కార్తికేయ హీరోగా ఈ మధ్య విడుదలైన బెదురులంకా 2012 సినిమా మాత్రం యావరేజ్ హిట్ గా మిగిలే ఛాన్స్ ఉంది. తమిళ సినిమా జైలర్ తప్ప మన తెలుగు సినిమాలు ఏవి బేబీ తర్వాత ఆడలేదు.
ఇలాంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీ అలానే తెలుగు ప్రేక్షకులు తమ ఆశలన్నీ రాబోయే విజయ్ దేవరకొండ సినిమా ఖుషి పైన పెట్టుకున్నారు. లవ్ స్టోరీస్ మాస్టర్ శివనిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అందుకుంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.
ఇక ప్రస్తుతం విలవిలలాడిపోతున్న తెలుగు బాక్సాఫీస్ ని.. తమ్ముడు తర్వాత అన్న విజయ దేవరకొండ కాపాడుతారని ఆశలు పెట్టుకోనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ఆశ తీరుస్తుందో లేదో తెలియాలి అంటే సెప్టెంబర్ ఒకటి వరకు వెయిట్ చేయాలి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఖుషి సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయళం భాషల్లో ఖుషి విడుదల కానుంది.