https://oktelugu.com/

India’s biggest flop film : రతన్ టాటా నిర్మాణంలో వచ్చి భారీ నష్టాలను తెచ్చుకున్న సినిమా ఏదో తెలుసా?

స్టీల్, ఆటోమోబైల్ వ్యాపారంలో దిగ్గజ బిజనెస్ మేన్ గా నిలిచిన రతన్ టాటా సారథ్యంలో ఓ సినిమా వచ్చింది. ఈ సినిమాపై అప్పట్లోనే రూ.9 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ చేశారు. కానీ ఈ మూవీ కనీస అంచనాలు కూడా అందుకోలేకపోయింది. ఈ మూవీ వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : September 27, 2024 / 10:01 AM IST

    India's biggest flop film

    Follow us on

    India’s biggest flop film : భారతదేశంలో సినిమా వ్యాపారం కోట్ల టర్నోవర్ లో ఉంటుంది. మిగతా పరిశ్రమలో కంటే సినిమా వ్యాపారంలో చాలా మంది భారీగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంటారు. పెద్ద పెద్ద వ్యాపారులు సైతం సినిమా రంగంలో అడుగుపెట్టారు. సినిమాపై పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ తిరిగి వస్తుందని చాలా మంచి అనుకుంటారు. ఇటీవల రిలీజ్ అయిన‘కల్కి’ పై రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టగా.. రూ. వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే అందరికీ అనుకూలమైన రోజులు ఉండవు. అలాగే ప్రతీ నిర్మాతకు లాభాలు వస్తాయని అనుకోలేం. అయితే స్టీల్, ఆటోమోబైల్ వ్యాపారంలో దిగ్గజ బిజనెస్ మేన్ గా నిలిచిన రతన్ టాటా సారథ్యంలో ఓ సినిమా వచ్చింది. ఈ సినిమాపై అప్పట్లోనే రూ.9 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ చేశారు. కానీ ఈ మూవీ కనీస అంచనాలు కూడా అందుకోలేకపోయింది. ఈ మూవీ వివరాల్లోకి వెళితే..

    ఒకప్పుడు బాలీవుడ్ స్వర్ణయుగం అని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ చిత్రాలకు కొలువు బీ టౌన్ అని కూడా అంటారు. అందుకే చాలా మంది వ్యాపార వేత్తలు సైతం ఈ రంగంలో ఇన్వెస్ట్ మెంట్ చేశారు. అలాగే తాను కూడా ఓ చెయ్యి వేద్దామని రతన్ టాటా అనుకున్నారు. ఈ నేపథ్యంలో 2004లో ‘ఏత్ బార్’ అనే సినిమా కోసం పెట్టుబడులు పెట్టారు. ఈ మూవీ టాటా ఇన్ఫోమీడియా బ్యానర్ పై నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిసాసబసు ప్రధాన పాత్రలుగా నిలించారు.

    1996లో అమెరికన్ ఫిల్మ్ ‘ఫియర్’ అనే సినిమా ప్రేరణ ఆధారంగా ‘ఏత్ బార్’ ను నిర్మించారు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే.. తన కూతురు బాగా ప్రేమించి వ్యక్తి మనో వ్యాధికి గురైతే ఆ వ్యాధి నుంచి రక్షించడానికి డాక్టర్ ప్రయత్రిస్తాడు. ప్రేమ అనే వ్యాధి బారిన పడిందని, అందులో నుంచి బయటకు తీసుకురావాలని తండ్రి తపన పడుతూ ఉంటారు. ఇందులో అమితాబ్ బచ్చన్ డాక్టర్ రణవీర్ మల్హోత్రా పాత్రలో నటించారు. అతని కూతురు రియా మల్హోత్రా పాత్రలో నటించింది. ఆర్యన్ త్రివేది పాత్రలో జాన్ అబ్రహం నటించారు. జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రేమలో పడుతారు.

    ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించాడు. వ్యాపార దిగ్గజం మొదటిసారిగా భారీ అంచనాలు పెట్టుకొని 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ఈ సినిమాకు రూ.9.50 కోట్లు ఇన్వెస్ట్ మెంట్ చేశారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఈ మూవీ రూ.4.25 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.7.96 కోట్లు మాత్రమే కలెక్షన్ చేసింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన రతన్ టాటా మరోసారి సినిమాల వైపు చూడలేదు.

    వ్యాపారంలో ఎన్నో విజయాలు చవిచూసిన ఆయనకు సినిమా రంగం కలిసి రాలేదు. దీంతో అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ స్టీల్ వ్యాపారంతో పాటు కార్లు, టెలికం రంగంలో తనదైన ముద్ర వేశారు. తాజాగా పరోక్షంగా బీఎస్ఎన్ ఎల్ హక్కులు పొందే ప్రయత్నంలో ఉన్నారు.