Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ టీజర్ నిన్న విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత డైరెక్టర్ శంకర్ నుండి ఒక పర్ఫెక్ట్ కంటెంట్ తో రాబోతున్న సినిమాని చూడబోతున్నాం అంటూ ఈ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అంతే కాకుండా రామ్ చరణ్ ని కూడా ఇంత ఊర మాస్ రోల్ లో చూసి చాలా కాలం అయ్యిందని, మళ్లీ అలాంటి రోల్ లో చూపించినందుకు శంకర్ కి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు పోస్టులు వేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ కారణంగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గత రెండు మూడు రోజుల క్రితం వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్లో గా ఉండేవి.
ఇప్పటి వరకు కేవలం వెయ్యి షోస్ ని మాత్రమే షెడ్యూల్ చేసారు. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలన్నీ రెండు వేలకు పైగా షోస్ తోనే షెడ్యూల్ అయ్యాయి. ఆ కారణంగా వాటికి భారీ స్థాయిలో ప్రీమియర్ షోస్ నుండి గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘గేమ్ చేంజర్’ కి షోస్ పెంచకపోవడం వల్ల వసూళ్లు పెరగలేదు. దానికి తోడు సినిమా కంటెంట్ పెద్దగా మేకర్స్ రెవీల్ చేయకపోవడం, నార్త్ అమెరికా లో ఒక్కో టికెట్ ధర 30 డాలర్లు ఉండడం, అంటే మన ఇండియన్ కరెన్సీ లో 2400 రూపాయిలు అన్నమాట. ఈ పరిస్థితులన్నీ ‘గేమ్ చేంజర్’ చిత్రం పై పగబట్టాయి. దీంతో నిన్నటి వరకు ఈ చిత్రానికి కేవలం 3,60,000 డాలర్లు మాత్రమే బుకింగ్స్ ద్వారా వచ్చాయి. రోజుకి 15 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే పెరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదలైందో, అప్పటి నుండి గ్రాస్ అమాంతం పెరిగిపోయింది.
ఈరోజుతో అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా 4,36,000 డాలర్ల గ్రాస్ వసూళ్లకు చేరింది. ఇంకా షెడ్యూల్ కావాల్సిన షోస్ చాలా ఉన్నాయి. ఐమాక్స్ ఫార్మట్స్ షోస్ ఈరోజు, లేదా రేపు షెడ్యూల్ అవ్వనుంది. ఈ ఫార్మాట్ షోస్ కారణంగా వసూళ్లు భారీగా పెరగనుంది. కేవలం ఈ ఒక్క ఫార్మాట్ నుండి మూడు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇదే ఫ్లో ని కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతే ప్రీమియర్స్ నుండి 1.5 మిలియన్ డాలర్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయని. పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రం ‘దేవర’ ప్రీమియర్స్ + మొదటి రోజు వసూళ్లను దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రం నార్త్ అమెరికా లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 4.5 మిలియన్ డాలర్లు రావాలి. వీకెండ్ లోపే ఆ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.