Major Movie Review: మేజర్ మూవీ రివ్యూ..
దర్శకత్వం: శశి కిరణ్ తిక్క
నిర్మాత : మహేష్ బాబు
ఓ రియల్ హీరో కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కింది. ఉగ్రదాడిలో మరణించిన వీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా నిర్మించారు. హీరో అడివి శేషు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మేజర్ మూవీ కోసం అడివి శేషు చాలా రీసెర్చ్ చేశారు. సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను, మిత్రులను కలవడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఆర్మీ క్యాంప్స్ లో అడివి శేషు గడిపారు. శిక్షణ తీసుకున్నారు. సందీప్ ఉన్నికృష్ణన్ లుక్ కోసం జిమ్ లో శ్రమించారు. మహేష్ నిర్మాతగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మేజర్ ఎలా ఉందో చూద్దాం..
Also Read: Heroine Ester: మేనేజర్లతో అడిగించారు.. ఆ కోరిక తీర్చమన్నారు: ఎస్తర్ షాకింగ్ కామెంట్స్
కథ:
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్(అడివి శేషు) బాల్యం నుండి ఎదురైన కొన్ని సంఘటనలతో స్ఫూర్తి పొందుతాడు. దేశానికి సేవ చేసే సోల్జర్ గా మారాలని నిర్ణయించుకుంటారు. సందీప్ తల్లిదండ్రులు ఆయన్ని ఓ డాక్టర్ లేదా ఇంజనీర్ చేయాలకుంటారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా… సందీప్ ఎన్ఎస్జీ ఆఫీసర్ గా బాధ్యతలు చేపడతాడు. దేశ సేవే లక్ష్యంగా బాధ్యతలు చేపట్టిన సందీప్ కి పెద్ద సవాల్ ఎదురవుతుంది. సందీప్ విరోచిత పోరాటం ఎలా ముగిసింది అనేది కథ..
విశ్లేషణ:
ఓ రియల్ హీరో కథను చెప్పడంలో దర్శకుడు దర్శకుడు శశి కిరణ్ తిక్క పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. సందీప్ ఉన్ని కృష్ణన్ బాల్యం, చదువుకునే రోజులు ఆ తాలూకు జ్ఞాపకాలు అద్భుతంగా తెరకెక్కించారు. దేశభక్తుడిగా ఆయన మారిన తీరు చాలా బాగుంది. ముఖ్యంగా ఫ్యామిలీ, ప్రేయసి, దేశభక్తికి సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
ఇక నటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలనే అడివి శేషు అన్నీ తానై ఈ సినిమాను నడిపించారు. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఆయనలా కనిపించడం కోసం అడివి శేష్ చేసిన శ్రమ, హోమ్ వర్క్ మూవీలో కనిపిస్తుంది. ఆయన నటనతో ప్రేక్షకుల కంట నీరు తెప్పించారు. తెరపై ఉన్ని కృష్ణన్ చూస్తున్న భావన కలుగుతుంది. నిజంగా ఆయనే నటించారేమో అనిపిస్తుంది.
ఇక మేజర్ మూవీలో కీలక పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రేవతి ఆకట్టుకున్నారు. తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక హీరోయిన్ సాయి మంజ్రేకర్ తో అడివి శేష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే మేజర్ చిత్ర నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ అసలు కాంప్రమైజ్ కాకుండా మేజర్ తెరకెక్కించారు ఆయన ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపిస్తుంది.
స్లోగా సాగే కథనం మూవీలో మైనస్ గా చెప్పవచ్చు. ఇక కాలేజ్ సన్నివేశాలు, హీరోయిన్ తో రొమాన్స్ ఆసక్తికరంగా సాగుతాయి. అయితే అందరికీ తెలిసిన కథే కావడం, ట్రాజిక్ ఎండింగ్ నిరాశ పరిచే అంశాలు. బయోపిక్ కావడంతో కొన్ని మార్చలేం కదా..
ప్లస్ పాయింట్స్ :
అడివి శేష్ నటన
నిర్మాణ విలువలు
ఎమోషనల్ సన్నివేశాలు
కథనం
మైనస్ పాయింట్స్:
స్లో నరేషన్
ట్రాజిక్ ఎండింగ్
సినిమా చూడాలా వద్దా?
కొన్ని చిత్రాలను జడ్జి చేయకూడదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ వీరుడి కథే మేజర్ మూవీ. అందరికీ తెలిసిన కథను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హీరో అడివి శేషు అన్నీ తానై సినిమా నడిపించారు. అద్భుతమైన నిర్మాణ విలువలు కూడిన మేజర్ మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ అందరూ చూడాల్సిన చిత్రం.
Also Read:F3 Movie Collections: ప్చ్… ఎఫ్3 కి ఇంకో వారం దొరికుంటే బాగుండేది!