Major Movie Censor Review: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో ‘అడవి శేష్’ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

తాజాగా మేజర్ సినిమాకి సెన్సార్ అయ్యింది. యూ/ఏ సర్టిఫికెట్ తో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా గురించి సెన్సార్ రిపోర్ట్ విషయానికి సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. సినిమాలో మంచి ఫీల్ ఉందని.. అలాగే దేశభక్తికి సంబంధించి కూడా ఈ చిత్రం గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని తెలుస్తోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read: Tollywood Heros: తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే అయిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?
ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏది ఏమైనా ‘అడివి శేష్’ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన పేద కళాకారుడిగా ఎన్నో ఇబ్బందులు పడి నేడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.

జీరో నుంచి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను క్రియేట్ చేసుకుని వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. తనకు మాత్రమే సాధ్యం అన్నట్టు వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అడివి శేష్ కి, లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
కాగా, ఈ మేజర్ సినిమాను జి.ఎమ్.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. శ్రీ చరణ్ పాకల ఈ మూవీకి సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషలలో విడుదలవబోతుంది.
Also Read:Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది, మతి పోగొట్టింది !
Recommended videos



[…] […]