Adipurush : ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’ త్వరలో థియేటర్లలోకి రానుంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విపరీతమైన ఆదరణ పొందుతున్నది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. కాగా, నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర పోషించారు.
ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓపెనింగ్, బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించి బాలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ అకా KRK ట్వీ్ట్ చేశాడు. ఈ చిత్రం మొదటి రోజు రూ. 150 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్వీట్ చేశారు. KRK తనను తాను ట్రేడ్ అనలిస్ట్‌గా భావించి బాలీవుడ్ నటులు, వారి చిత్రాల గురించి తన అభిప్రాయాన్ని తరచూ తెలియజేస్తూ ఉంటాడు. దాదాపు ప్రతి విషయంలోనూ తన అభిప్రాయాన్ని చెబుతూనే ఉంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఓ పెద్ద విషయం చెప్పాడు.
తొలి రోజు రూ. 150 కోట్లు..
ఆదిపురుష్ ఇండియాలోనే తొలిరోజు రూ.150 కోట్ల వసూలు చేయనుందని కమల్ రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు. తొలి వారంలో రూ.1000 కోట్లు రాబడుతుందని పేర్కొన్నాడు. సౌత్ లో షారుక్ ఖాన్ కంటే ప్రభాస్ కి ఎక్కువ క్రేజ్ ఉంది . కేఆర్‌కే చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ ట్వీట్‌పై తమ స్పందనను తెలియజేస్తున్నారు.
సినిమా ఎప్పుడు విడుదలవుతుంది
జూన్ 16న ఆదిపురుష్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు, రాముడు, రావణుడు మరియు హనుమంతుడి లుక్‌పై వచ్చిన విమర్శలు అంతా ఇంతా కాదు. ఈ విమర్శలను అధిగమించేందుకు దర్శక నిర్మాతలు VFX కు మళ్లీ పని చెప్పారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుండడంతో యూనిట్లో కొత్త ఉత్సాహం వస్తున్నది.
-శెనార్తి