Adipurush:అనుకున్నట్లే ‘ఆదిపురుష్’ వాయిదా పడింది. కొన్ని రోజులుగా ఈ సినిమా టీజర్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో సినిమాను రీ షూట్ చేయాలని నిర్ణయించారు. ఇందుకు కాస్త సమయం తీసుకోనున్నారు. దీంతో ఇప్పటి వరకు వేసవిలో ‘ఆదిపురుష్’ వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా పడే అవకాశాలున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ వస్తుందని ఆశించారు. కానీ కొన్ని కారణాల వల్ల సమ్మర్ కు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ కు మరింత మెరుగులు దిద్దేందుకు సమయం పట్టనుంది. దీంతో సమ్మర్ లో సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశాలు లేవు. రామాయణ ఇతివృత్తం నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 2న విడుదల చేశారు. అయితే టీజర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఇవి మరీ ఎక్కువ కావడంతో చిత్రాన్ని రీ షూట్ చేయాలని అనుకుంటున్నారు.

బాహుబలి తరువాత ప్రభాస్ ఇండియన్ వైడ్ సినిమాలే చేస్తున్నారు. అయితే భారీ హోప్స్ తో వచ్చిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ సినిమాలు డిజాస్టర్ ను మిగిల్చాయి. లెటేస్టుగా ‘ఆదిపురుష్’ కోసం బిజీగా మారాడు. రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాల ఆధారంగా ఈ సినిమాను బీ టౌన్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి హాసన్ నటిస్తున్నారు. ఇక రావణ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషించనున్నారు. రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం సడెన్లీగా టీజర్ విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు.
అయితే ఈ టీజర్ పై అనేక విమర్శలు వచ్చాయి. రాముడి పాత్రలో ఉన్న ప్రభాస్ కండలు తిరిగి ఉన్నాడని, అలాగే రాముడు నీలం కలర్లో ఉంటే ప్రభాస్ ను స్టైలిష్ గా చూపించారని అన్నారు. ఇక రావణ పాత్రపై హిందు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రావణుడు శివ భక్తుడు కాగా.. అతడిని రాక్షసుడిగా చూపించారని అన్నారు. బాలీవుడ్ నటుడు ముఖేష్ కన్నా మాట్లాడుతూ ఈ టీజర్లో రాముడు, రావణుడు నాకైతే ఎక్కడా కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి సైతం టీజర్ పై స్పందించారు. హిందూ మతానికి సంబంధించిన విశ్వాసాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.
కొన్ని రోజుల పాటు ఎన్ని విమర్శలు వచ్చినా సినిమా బృందం స్పందించలేదు. కానీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రీ షూటింగ్ చేయక తప్పదని భావించింది. అయితే అభ్యంతకర సీన్లను తీసేసి రీ షూట్ చేయడానికి వీఎఫ్ఎక్స్ కోసం రూ.100 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. రీ షూట్ కు సమయం పడుతుండడంతో వచ్చే వేసవి విడుదల కావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా ‘ఆదిపురుష్’ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. ఆ తరువాత ఆగస్టుకు వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.