Adipurush Poster Controversy: ఆదిపురుష్ మూవీ ఏ క్షణాన మొదలుపెట్టారో కానీ అన్నీ వివాదాలే. టీజర్ విడుదల నుండి హీటు మొదలైంది. ఆదిపురుష్ టీజర్ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రధాన పాత్రల గెటప్స్ విమర్శల పాలయ్యాయి. హనుమంతుడు, రావణాసురుడు గెటప్స్ ని జనాలు తప్పుబట్టారు. అసలు దర్శకుడు ఓమ్ రౌత్ కి రామాయణం తెలుసా? పురాణ పాత్రలను ఇష్టం వచ్చినట్లు చూపిస్తారా? అని మండిపడ్డారు. హిందూవర్గాలు ఆదిపురుష్ చిత్ర యూనిట్ కి హెచ్చరికలు జారీ చేశారు. ఆదిపురుష్ థియేటర్స్ లో ప్రదర్శించనీయమని అల్టిమేటం జారీ చేశారు.
ఇక టీజర్లో విజువల్స్ చాలా నాసిరకంగా ఉన్నాయన్న మాట వినిపించింది. వందల కోట్లు ఖర్చు పెట్టి, ప్రభాస్ వంటి హీరోతో కార్టూన్ మూవీ చేశారన్న విమర్శలు వినిపించాయి. ఆ విమర్శల దాడికి ఆదిపురుష్ మూవీ ఆరు నెలలు వాయిదా వేశారు. సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా జూన్ 16కి వాయిదా వేశారు. బడ్జెట్ పెంచి విజువల్స్ తో పాటు లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల ఆదిపురుష్ ట్రైలర్ విడుదల కాగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఆదిపురుష్ ట్రైలర్ కి ప్రశంసలు దక్కాయి.
అయినా కూడా ఓ విషయంలో దొరికిపోయారు. ఆదిపురుష్ ట్రైలర్ లో డిటైల్స్ వెతుకుతున్న నెటిజెన్స్ ఓ మిస్టేక్ కనుగొన్నారు. హనుమంతుడు గాలిలో ఎగురుతుండగా ఆయనపై కూర్చొని ప్రభాస్ యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ షాట్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయట. రామాయణం కాలంలో బహుళ అంతస్తుల బిల్డింగ్స్ ఎక్కడ నుండి వచ్చాయని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. వారి ఆరోపణలకు ఆధారాలు చూపుతున్నారు. ఇదో పెద్ద తలనొప్పిగా మారింది.
హాలీవుడ్ పోస్టర్స్ తీసుకొని ఎడిట్ చేశారని అందుకే ఇలా దొరికిపోయారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ మూవీలో రాముని గెటప్ కాపీ అంటూ ఓ ఆర్టిస్ట్ ఆరోపణలు చేశారు. నేను క్రియేట్ చేసిన రాముని రూపాలు అనుమతి లేకుండా దర్శకుడు వాడాడని సదరు ఆర్టిస్ట్ విమర్శలు గుప్పించారు. మొత్తంగా ఆదిపురుష్ పై ఒక వివాదం తర్వాత మరొక వివాదం వెంటాడుతుంది. ఈ మూవీలో సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.