Adipurush: సమ్మర్ లో ఒక్క పెద్ద హీరో సినిమా కూడా విడుదల లేక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది.విడుదలైన మీడియం రేంజ్ హీరోల సినిమాలు బయ్యర్స్ కి కలిగించిన నష్టాల లెక్క మామూలుది కాదు, కేవలం దసరా మరియు విరూపాక్ష చిత్రాలు తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క సక్సెస్ కూడా లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ మళ్ళీ సంక్షోభం లోకి వెళ్లకుండా, పూర్వ వైభవానికి రావాలంటే కచ్చితంగా స్టార్ హీరో సినిమా పడాల్సిందే.
వచ్చే నెల యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరియు లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ని శ్రీరాముడిగా చూసేందుకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ప్రముఖ యంగ్ డైరెక్టర్ మారుతీ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రభాస్, ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే ‘ఆదిపురుష్’ మూవీ ప్రొమోషన్స్ తో ఫుల్ బిజీ కానున్నాడు. సినిమా మీద ఇప్పటికే తారాస్థాయిలో హైప్ ఉంది, బాలీవుడ్ ఆడియన్స్ అయితే మన టాలీవుడ్ ఆడియన్స్ కంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఓవర్సీస్ లో ప్రతీ సినిమాకి మూడు వారాలు ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ ఓపెన్ చేసే సంగతి మన అందరికీ తెలిసిందే.
అలా ఆదిపురుష్ మూవీ కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికా లోని 9 లొకేషన్స్ కి గాను 21 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఈ 21 షోస్ నుండి 319 టికెట్స్ అమ్ముడుపోగా 6 వేలకు పైగా డాలర్స్ గ్రాస్ వచ్చింది. ఇది అద్భుతమైన ప్రారంభం అనే చెప్పాలి. రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్లు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.