Adipurush Collections : ‘ఆదిపురుష్’ మొదటి రోజు వసూళ్లు.. 130 కోట్లు వస్తుంది అనుకున్నారు.. కానీ చివరికి ఎంత వచ్చిందంటే!

ఆదిపురుష్ చిత్రానికి మొదటి రోజు 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేశారు. అర్థ రాత్రి నుండే డివైడ్ టాక్ రావడంతో నూన్ షోస్ కాస్త డల్ అయ్యాయి,

Written By: NARESH, Updated On : June 16, 2023 8:47 pm
Follow us on

Adipurush Collections : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ కి మంచి టాక్ వచ్చింది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం బాగాలేదని, గ్రాఫిక్స్ బాగా నిరాశపర్చిందని, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ పెదవి విరిచారు.

కానీ ప్రభాస్ బ్రాండ్ ఇమేజి మరియు శ్రీ రాముడి భక్తుల కారణం గా ఈ చిత్రానికి మొదటి రోజు కనీవినీ ఎరుగని రేంజ్ ఓపెనింగ్ దక్కింది. ఈ ఓపెనింగ్ ని చూసి ఇతర హీరోలు కూడా అసూయ పడుతున్నారు. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త బెంచ్ మార్క్ గ్రాస్ ని పెట్టిన ఈ సినిమా, విడుదల తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఒక విస్ఫోటనం ని సృష్టించింది అనే చెప్పాలి.

నిన్న జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూసి ట్రేడ్ వర్గాలు ఈ చిత్రానికి మొదటి రోజు 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేశారు. అర్థ రాత్రి నుండే డివైడ్ టాక్ రావడం తో నూన్ షోస్ కాస్త డల్ అయ్యాయి, మ్యాట్నీ షోస్ పరిస్థితి కూడా అలాగే ఉన్నింది. కానీ ఫస్ట్ షోస్ నుండి మాత్రం ఒక రేంజ్ లో జనాలు థియేటర్స్ కి పోటెత్తారు.

ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ మొత్తం కలకలలాడిపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, హిందీ లో కూడా ఇదే పరిస్థితి. అలా ఒక్కసారిగా బుకింగ్స్ ట్రెండ్ పెరిగిపోవడం తో ఈ చిత్రానికి మొదటి రోజు ఏకంగా 150 నుండి 160 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక నిజమైతే ఈ రికార్డు ని మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పట్లో అందుకోలేరనే చెప్పాలి.