https://oktelugu.com/

Aadipurush : బాలీవుడ్ లో ఖాన్స్ రికార్డ్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే లేపేసిన ‘ఆదిపురుష్’..ఇది కేవలం ఆరంభం మాత్రమే!

'పఠాన్' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజు మొత్తానికి PVR చైన్స్ నుండి నాలుగు వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ 'ఆదిపురుష్' చిత్రానికి మాత్రం ఏకంగా 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం బాలీవుడ్ ట్రేడ్ ని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : June 11, 2023 / 06:16 PM IST
    Follow us on

    Aadipurush : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చే వారం 16 వ తేదీన గ్రాండ్ గా అనీ ప్రాంతీయ బాషలలో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ విన్నూతనమైన ప్రొమోషన్స్ తో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్స్, పాటలు ఈ చిత్రం పై అంచనాలను అమాంతం పెంచేసాయి.

    ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని నాలుగు వారాల ముందే ప్రారంభించారు. కానీ అక్కడ అత్యధిక షోస్ లేకపోవడం వల్ల ట్రేడ్ ఆశించిన స్థాయి ప్రీమియర్ నంబర్స్ రావడం లేదు. ఇప్పటి వరకు ప్రీమియర్స్ కి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ నుండి రెండు లక్షల 30 వేల డాలర్లు వచ్చాయి. ప్రభాస్ రేంజ్ కి మరియు సినిమా కి పెట్టిన బడ్జెట్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.

    ఓవర్సీస్ బుకింగ్స్ ని కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా హిందీ బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. ఈరోజే ముంబై , కోల్ కత్తా, ఢిల్లీ వంటి ప్రధాన సిటీస్ లో ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. రెస్పాన్స్ అదిరిపోయింది, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ సమయం లోనే 10 వేల టిక్కెట్లు కేవలం PVR ముల్టీప్లెక్స్ చైన్ నుండే అమ్ముడుపోయాయట. ఈ ఏడాది ఆల్ టైం డే 1 రికార్డు ని సృష్టించిన షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ కి కూడా ఈ స్థాయి ట్రెండ్ జరగలేదు.

    ‘పఠాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజు మొత్తానికి PVR చైన్స్ నుండి నాలుగు వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ ‘ఆదిపురుష్’ చిత్రానికి మాత్రం ఏకంగా 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం బాలీవుడ్ ట్రేడ్ ని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే పఠాన్ మొదటి రోజు రికార్డుని ఆదిపురుష్ చిత్రం బద్దలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.