Bigg Boss 6 Telugu Adi Reddy: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ ప్రారంబమైన బిగ్ బాస్ 6 రియాలిటీ షో ప్రారంభం లో కాస్త నత్తనడకనే సాగినప్పటికీ కూడా ఈమధ్య కాలం లో ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకాదరణ పొందుతూ ముందుకి దూసుకుపోతుంది..మొదటి రోజు నుండి నేటి వరుకు ఈ సీసన్ లో కచ్చితంగా టైటిల్ కొట్టే దమ్ము ఉన్న ఏకైక కంటెస్టెంట్ గా రేవంత్ నిలిచాడు..సోషల్ మీడియా లో జరిగే అనేక పొలింగ్స్ లో కూడా రేవంత్ అందరికంటే ముందు వరుసలో కొనసాగుతూ వస్తున్నాడు..అతని తర్వాతి స్థానం లో శ్రీహాన్ కొనసాగుతున్నాడు..టైటిల్ విన్నర్ రేవంత్ మరియు రన్నర్ శ్రీహాన్ అని అందరికి అర్థం అయిపోయింది..కానీ బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేము..నిమిషాల వ్యవధి లోనే అన్ని మారిపోతూ ఉంటాయి..నిన్న మొన్నటి వరుకు టాప్ 5 లో ఉంటాడా లేదా అనేలా అనిపించే ఆది రెడ్డి ఈ వరం తన గ్రాఫ్ ని అమాంతం పెంచుకొని ఇప్పుడు సోషల్ మీడియా లో జరుగుతున్న పొలింగ్స్ లో రేవంత్ తో నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ ఇస్తున్నాడు.

ఆది రెడ్డి గ్రాఫ్ ఈ రేంజ్ లో పెరగడానికి కారణం ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ అని చెప్పొచ్చు..ఈ టాస్కులో బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్స్ ని వినియోగించుకొని ఇంటి సభ్యులతో మాట్లాడాలి..అలా ఆదిరెడ్డి తన కుటుంబ సభ్యులతో నిన్న వీడియో కాల్ లో మాట్లాడిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది..ఆది రెడ్డి భార్య కవిత మాట్లాడిన మాటలు ఆదిరెడ్డి లో సరికొత్త నూతనోత్సాహం నింపింది..ఆమె మాట్లాడుతూ ‘నువ్వు బిగ్ బాస్ కి వెళ్తాను అంటే నేను మొదట్లో వద్దు అన్నాను..కానీ ఈరోజు నువ్వు ఆడుతున్న తీరుని చూసి నేను గర్వపడుతున్నాను.

ఒక సాధారణ మనిషి రివ్యూయర్ గా మారి,బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి కెప్టెన్ కూడా అయ్యావు..మాకు చాలా సంతోషం గా ఉంది..నువ్వు టైటిల్ కూడా కొట్టి రావాలి..నువ్వు మాకోసం దూరం గా మూడు నెలలు ఉన్నందుకు ప్రతిఫలం రావాలి’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఆదిరెడ్డి లో ఆత్మవిశ్వాసం పెంచాయి..ఆమె మాటలు విన్న తర్వాత ఆది రెడ్డి చాలా ఎమోషనల్ అయ్యాడు..ఈ వీడియో కాల్ ఆయన గ్రాఫ్ పెరగడానికి కూడా కారణం అయ్యింది..కేవలం ఈ ఒక్క వీడియో కాల్ తోనే ఆయన గ్రాఫ్ పెరగలేదు..ఈమధ్య కాలం లో ఆయన ఆట తీరు కూడా బాగా మారింది..ఉన్నది ఉన్నట్టు బలంగా మాట్లాడుతున్నాడు..తన తప్పు లేనప్పుడు కంటెస్టెంట్స్ తో ఎంత పెద్ద గొడవ పడడానికైనా వెనకాడడం లేదు..అందువల్లే అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు అంటున్నారు విశ్లేషకులు..ఇదే ఊపులో కొనసాగితే ఆది రెడ్డి టైటిల్ గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.