Dacoit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల్లో అడవి శేషు ఒకరు… డిఫరెంట్ కథాంశాలతో సినిమాలను చేసి ప్రేక్షకులను మైమరిపింప చేయడంలో ఆయన దిట్ట ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ డిఫరెంట్ ఫార్మాట్లోనే ముందుకు సాగుతుంటాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలను పకడ్బంది ప్రణాళికతో రూపొందించి ఆ సినిమాని సూపర్ సక్సెస్ చేయడంలో ఆయనకు చాలా మంచి పేరు ఉంది. ఇక ప్రస్తుతం ‘డెకాయిట్’ అంటూ ఒక సినిమానైతే చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో కచ్చితంగా విజయం సాధిస్తానని శేషు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సుప్రియ ఈ సినిమా నిర్మిస్తుండటం విశేషం…
ఇక ఈ సినిమా కథని మొదట అక్కినేని హీరో అయిన అఖిల్ కి వినిపించారట. కానీ అఖిల్ మాత్రం ఈ సినిమాను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదటం. దాంతో ఈ కథను అడివి శేషు దగ్గరికి తీసుకెళ్లి అతనితో ఆ క్యారెక్టర్ చేయించారు. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను పెట్టుకొని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలతో ఆమెను పక్కన పెట్టి మృణాళ్ ఠాకూర్ ను పెట్టి ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ మూవీ పక్కగా విజయం సాధిస్తుందంటూ అడవి శేషు అయితే మంచి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి ఆయనకంటూ ఒక క్రేజ్ ను తీసుకొచ్చి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… గతంలో చేసిన క్షణం, ఎవరు, గూడచారి, మేజర్ లాంటి సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చిబెట్టాయి.
థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ గా మారాడు. ఇక శేషు ఇప్పుడు చేస్తున్న ఈ డెకాయిట్ సినిమాతో పలు వైవిధ్య భరితమైన పాత్రలనైతే పోషించారట. ఈ మూవీలో ఒక దొంగగా నటించి ప్రేక్షకులను మెప్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు టాప్ హీరోల రేంజ్ లోకి ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
