Adarsha Kutumbam Venkatesh Remuneration: ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు వెంకటేష్… ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలతో వరుస విజయాలను సాధిస్తున్నాడు. గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అదరగొట్టిన ఆయన ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ను చేసి సక్సెస్ ని సాధించాడు. మొత్తానికైతే వెంకీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు ఎప్పుడో సినిమా రావాల్సింది. కానీ అది వర్కౌట్ కాలేదు. చాలామంది అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అయింది. కాబట్టి ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి… ఇక ప్రస్తుతం వెంకటేష్ ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆయన 35 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఈ సినిమాకి 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు..
వీలైతే ఆయనకు 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వచ్చని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సైతం 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలనే అంచనాతో మేకర్స్ ఈ సినిమాను రెడీ చేస్తున్నారు.
త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలకు వెంకటేష్ కామెడీ టైమింగ్ సెటయితే మాత్రం ఈ సినిమా వండర్స్ ని క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… వెంకటేష్ నుంచి ప్రతి ఆడియన్ కామెడీని, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాని కోరుకుంటారు.
కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ మిస్ అవ్వకుండా వెంకటేష్ దానిని స్క్రీన్ మీద డిఫరెంట్ గా ప్రెసెంట్ చేయగలిగితే మాత్రం ఈ మూవీ మరొక నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి క్లాసికల్ హిట్ మూవీ గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…